For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్ హీరోయిన్ మాట: ‘మగాడు నిన్ను వదిలేస్తే అది నీ లోపం కాదు, కామం తాత్కాలిక సుఖమే’

|

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ముందు నుంచి తన లవ్ లైఫ్ విషయంలో గోప్యత పాటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రణబీర్ కపూర్‌తో ఆమె విడిపోయి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అవ్వడానికి కారణం ఏమిటనే విషయం ఇప్పటికీ బయటకు చెప్పలేదు.

కత్రినాతో విడిపోయిన తర్వాత రణబీర్ కపూర్ మరో హీరోయిన్ అలియా భట్‌తో ప్రేమాయణం మొదలు పెట్టాడు. అయితే కత్రినా మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటోంది. ఆమె ఎందుకు ఇలా ఉంటోంది? అనే విషయం ఎవరికీ అంతు పట్టడం లేదు. రణబీర్‌తో ప్రేమాయణం తర్వాత కత్రినాకు రిలేషన్‌షిప్ మీద ఆసక్తి పోయిందని, అందుకే ఆమె ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదనే వాదన కూడా ఉంది.

మహిళ విలువ మగాడి వల్ల పెరగదు

తాజాగా కత్రినాకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ఫ్యాన్ పేజీలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ అంశంపై ఆమె స్పందిస్తూ...‘మహిళ విలువ(సెల్ప్ వర్త్) అనేది ఒక మగాడి వల్ల పెరగదని, అది కేవలం ఆమె వల్లనే సాధ్యం అవుతుంది' అని వ్యాఖ్యానించారు.

మగాడు నిన్ను వదిలేస్తే అది నీ లోపం కాదు

ఒక మగాడు మరొక మహిళ కోసం నిన్ను వదిలిపెడితే... అది నీలోని లోపంగా అస్సలు భావించకూడదు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఈ విషయంలో ఏ మహిళ తనను తాను తక్కువ చేసి చూసుకోకూడదను అని కత్రినా వ్యాఖ్యానించారు. పురుషుడి సహాయం లేక పోయినా మహిళ తనకు తానుగా నిలదొక్కుకునే శక్తి కలిగి ఉండాలని కత్రినా సూచించారు.

కామం అనేది తాత్కాలిక సుఖమే

ప్రేమ, కామం ఈ రెండింటిలో దేనికి ప్రధాన్యత ఇస్తారు అనే అంశం గురించి ప్రశ్న ఎదురైనపుడు... తాను స్వచ్ఛమైన ప్రేమకే ప్రధాన్యత ఇస్తానని వెల్లడించారు. కామం అనేది తాత్కాలికంగా సుఖాన్ని ఇవ్వొచ్చు. మనసుకు ప్రశాంత, సంతోషాన్ని ఇచ్చేది ప్రేమ మాత్రమే అని కత్రినా కైఫ్ తెలిపారు.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ సినిమాల విషయానికొస్తే... థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, జీరో చిత్రాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కత్రినా కైఫ్ స్పీడు కాస్త తగ్గింది. అయితే ఈద్ సందర్భంగా విడుదైలన ‘భారత్' విజయం అందుకోవడంతో ఆమె కెరీర్ పరంగా పుంచుకున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘సూర్యవంశీ' అనే చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Katrina Kaif isn't one of those actresses, who is known for speaking her mind when it comes to her love life. Katrina has always maintained a secrecy around her love life and even today i.e., after two years of her break-up with Ranbir Kapoor, nobody knows why exactly things went wrong between them. While Katrina hasn't started dating anyone after parting ways with Ranbir, the latter got committed to Alia Bhatt.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more