twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గొప్ప మనసు చాటుకొన్న కత్రినాకైఫ్.. మరోసారి కార్మిక కుటుంబాలకు సాయం

    |

    అందం, అభినయంలోనే కాదు సామాజిక సేవలో కూడా ముందుంటానని మరోసారి నిరూపించారు బాలీవుడ్ సుందరి కత్రినాకైఫ్. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తాను ప్రమోట్ చేసే కే బ్యూటీ ప్రొడక్ట్‌తో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని కార్మిక కుటుంబాలకు మంగళవారం ఆర్థిక అండను అందించారు. గతంలో ఏప్రిల్ మాసంలో భండారా జిల్లాలోని కార్మికులకు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువుల సహాయం అందించిన విషయం తెలిసిందే.

    ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కత్రినా కైఫ్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా స్పందించారు. కే బ్యూటీ, దీహాత్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యమై రోజు వారీ వేతన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలనుకొన్నాను. వారికి ఆహారం, బేసిక్ సానిటరీ వస్తువులను అందించాం అని కత్రినా వెల్లడించారు.

    Katrina Kaif pledged to support daily wage workers of Bhandara district

    అంతేకాకుండా ఆపదలో, కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని తన అభిమానులకు సూచించారు. ఇలాంటి సమయంలో చిన్న సహాయమైనప్పటికీ వారి జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది అంటూ ఓ వీడియోను షేర్ చేశారుు. దీ హాత్ వ్వవస్థాపకుడు వృందన్ బృందం అద్భుతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించింది అంటూ కితాబు ఇచ్చారు.

    కోవిడ్ 19 పరిస్థితుల్లో ఇలాంటి సహాయాలే కాకుండా ప్రధానమంత్రి సహాయ నిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. కరోనా మహ్మమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఇలాంటి సహాయం ఎంతో అత్యవసరం అని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు.

    English summary
    Bollywood actor Katrina Kaif has pledged to support daily wage workers families around the Bhandara district in Maharashtra again through her brand, Kay Beauty. She said instagram that On Tuesday, taking to her Instagram, Katrina wrote, "Kay Beauty and the Dehaat foundation are partnering again for #KareWithKayBeauty. Together, we have lent our support to the daily-wage earning families living in the villages around the Bhandara district in Maharashtra, with food and basic sanitary materials."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X