కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్
నటీనటుల జీవితాల్లో ఏం జరిగినా అది ప్రజలకు ప్రత్యేకమే. ఎందుకంటే సినిమాలకు, సినీతారలకు మనదేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి ప్రేమ కథలు, ఎఫైర్లు, పెళ్లిళ్లు, విడాకులు ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సహజంగానే ఆసక్తి నెలకొంటోంది. ఇక హీరోయిన్లు గర్బం దాలిస్తే.. వారికి ఆడపిల్ల పుడుతుందా? మగపిల్లాడు పుడతాడా? అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతాయి. తాజాగా ఇలాంటి వాతావరణాన్నే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్.
సల్మాన్ ఖాన్‌తో సుధీర్ఘంగా డేటింగ్
కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ జంట పెళ్లయిన దాదాపు నాలుగేళ్ల తర్వాత తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ ఆనందాన్ని కలిగించింది. వీరిద్దరూ కనీసం ఒక్క సినిమాలో కలిసి నటించలేదు. అయినప్పటికీ కత్రినా, విక్కీలు పెళ్లి చేసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కత్రినా కైఫ్ గతంలో పలువురు స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించింది. సల్మాన్ ఖాన్‌తో ఏకంగా పెళ్లి వరకు వెళ్లింది. కానీ వీరిద్దరి మధ్య ఏం జరిగిందో? ఏమో కానీ ఈ జంట మధ్యలోనే విడిపోయింది.

విక్కీపై కత్రినా వ్యాఖ్యలు
సల్మాన్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత తన సినిమాలు, కెరీర్‌పై ఫోకస్ పెట్టిన కత్రినా కైఫ్ ఓ రోజున కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఓ షోలో విక్కీ కౌశల్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. అతనితో కలిసి నటించాలని ఉందని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అప్పటికే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సూపర్‌స్టార్‌లలో ఒకరిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు కత్రినా. అలాంటి ఆమె అప్పటికి చిన్నా చితకా నటుడిగా ఉన్న విక్కీ కౌశల్‌తో నటించాలని ఉందని చెప్పడం విస్మయం కలిగించింది.
సీక్రెట్‌గా విక్కీతో డేటింగ్
ఈ ఘటన జరిగిన తర్వాత ఓ అవార్డ్ కార్యక్రమంలో తొలిసారిగా కత్రినా - విక్కీ కౌశల్‌లు కలుసుకున్నారట. ఈ క్రమంలోనే కత్రినాకి తన మనసులోని మాటను చెప్పాడట విక్కీ. అనంతరం ఇద్దరూ కలిసి సీక్రెట్‌గా పార్టీలకు వెళ్లడం, అవార్డ్ ఫంక్షన్‌లలో పక్కపక్కనే కూర్చోవడం వంటి వాటితో కత్రినా, విక్కీ మధ్య ఏదో జరుగుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ ఊహాగానాల మధ్యే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరిద్దరూ ప్రకటించడం కలకలం రేపింది. 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.
బేబీ బంప్‌తో కత్రినా
పెళ్లయి దాదాపు నాలుగేళ్లు కావొస్తున్నా విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఎప్పుడు శుభవార్త చెబుతారని కుటుంబ సభ్యులు, సినీవర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. పలుమార్లు కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అయ్యారని గాసిప్స్ రాగా.. అవి కాస్తా గాలివార్తలుగానే మిగిలిపోయాయి. ఈ దశలో ఇటీవల బేబీ బంప్‌తో కత్రినా కైఫ్ ఫోటో షూట్ చేయించుకోవడంతో మీడియాకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు కత్రినా- విక్కీ కౌశల్‌లు అధికారికంగా ప్రకటించారు.
కత్రినా ప్రెగ్నెన్సీపై జ్యోతిష్యుడి వ్యాఖ్యలు
దాంతో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆమె డెలివరీ డేట్ ఇదేనంటూ అనేక వాదనలు వినిపించాయి. తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై బాలీవుడ్‌లో సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కత్రినా - విక్కీ కౌశల్‌కు మొదటి సంతానంగా ఆడపిల్ల పుడుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అనిరుధ్ కుమార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











