Katrina Kaif ఎంత ఆస్తి సంపాదించిందో తెలుసా? ఒక్కో మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తే ఠక్కున గుర్తొచ్చే తారల్లో కత్రినా కైఫ్ ఒకరు. బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకొన్నది. దక్షిణాదిలో విజయాలు వెక్కిరించడంతో బాలీవుడ్‌లో రాణించి అగ్రహీరోయిన్‌గా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకొన్నది.

అయితే కొద్దికాలంగా యువ హీరో వికీ కౌశల్‌తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ నికర ఆస్తులు, రెమ్యునరేషన్ తదితర విషయాలు ట్రెండింగ్‌గా మారాయి. కత్రినా ఆస్తులు ఎంతంటే?

భూమ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి

భూమ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి

కత్రినాకైఫ్ బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ముంబైలో అడుగుపెట్టింది. 2003లో భూమ్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. ఆ పరిస్థితుల్లో టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.

 టాలీవుడ్‌లో వెంకటేష్, బాలకృష్ణతో

టాలీవుడ్‌లో వెంకటేష్, బాలకృష్ణతో

2004 సంవత్సరంలో కత్రినా కైప్ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మళ్లీశ్వరి చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన కత్రినా నటించింది. ఆ తర్వాత బాలకృష్టతో అల్లరి పిడుగు అనే చిత్రంలో నటించింది. అయితే బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లవెత్తడంతో హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితమైంది.

హయ్యెస్ట్ ట్యాక్స్ చెల్లించే హీరోయిన్‌గా

హయ్యెస్ట్ ట్యాక్స్ చెల్లించే హీరోయిన్‌గా

బాలీవుడ్‌లో అనతికాలంలోనే కత్రినాకైఫ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. దేశవ్యాప్తంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా పాపులారిటీని సంపాదించింది. ఇండియాలోనే హయ్యెస్ట్ ట్యాక్స్ చెల్లించే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇంకా స్టార్ హీరోయిన్‌గా టాప్ రెమ్యునరేషన్ అందుకొంటున్నది.

అఫైర్లు, డేటింగ్ వ్యవహారాల జోరుతో

అఫైర్లు, డేటింగ్ వ్యవహారాల జోరుతో

బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఉంటూనే పలువురు స్టార్ హీరోలతో అఫైర్లు కొనసాగించింది. సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వచ్చి ఆగింది. ఆ తర్వాత పలువురు హీరోలతో డేటింగ్ చేసింది. ప్రస్తుతం వికీ కౌశల్‌తో పీకల్లోతూ ప్రేమాయణం సాగిస్తున్నది. త్వరలోనే రాజస్థాన్‌లో జరిగే వేడుకలో ఇద్దరూ ఒక్కటవ్వనున్నారు.

కత్రినా నికర ఆస్తి 225 కోట్లకుపైగానే

కత్రినా నికర ఆస్తి 225 కోట్లకుపైగానే

ఇదిలా ఉంటే.. కత్రినా కైఫ్ నికర ఆస్తుల విలువ భారీగానే ఉంది. ఆమె ఆస్తిని రూ.225 కోట్లుగా ఆర్థిక అంచనా సంస్థలు లెక్కకట్టాయి. అయితే విలాసవంతమైన నివాసాలు, ఫ్లాట్స్ సొంతంగా ఉన్నప్పటికీ. కత్రినా కిరాయి ఫ్లాట్‌లోనే నివాసం ఉంటారు. ఆమెకు కిరాయి ఇంట్లో ఉండటం సెంటిమెంట్‌గా భావిస్తారని సన్నిహితులు చెప్పుకొంటారు.

సినిమాకు 11 కోట్లకుపైగానే రెమ్యునరేషన్

సినిమాకు 11 కోట్లకుపైగానే రెమ్యునరేషన్

ఇక కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ కూడా టాప్ రేంజ్‌లో ఉంది. ప్రతీ సినిమాకు ఆమె సుమారు 11 కోట్లకుపైగానే రెమ్యునరేషన్ అందుకొంటారని బాలీవుడ్ వర్గాల టాక్. ఇక వ్యాపార ప్రకటనలకు కూడా భారీగానే వసూలు చేస్తారని వినికిడి. ఒక్కో యాడ్‌కు కనీసం 6 కోట్లు రూపాయలు ఫీజును వసూలు చేస్తుందని చెప్పుకొంటారు.

Recommended Video

Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
 సూర్యవంశీతో 150 కోట్ల క్లబ్‌లోకి

సూర్యవంశీతో 150 కోట్ల క్లబ్‌లోకి

తాజాగా కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.150 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక వారిద్దరూ నటించిన టిప్ టిప్ బర్సా పానీ పాట వైరల్ అయింది. గతంలో మోహ్రా చిత్రంలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కలిసి ఈ పాటపై స్పెప్టులు వేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X