Don't Miss!
- Sports
IND vs NZ: చెలరేగిన కాన్వే, మిచెల్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!
- News
కేసీఆర్కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!
- Finance
adani fpo: అదానీ FPO హిట్టా, ఫట్టా ? ఓపెనింగ్ డే సేల్ ఇంతేనా.. ??
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
స్టార్ హీరోలను రిజెక్ట్ చేస్తున్న మహానటి.. మెగా హీరోలయినా నో రొమాన్స్..!
నేటితరం మహానటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ ఎవరు ఊహించని ఆఫర్స్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో మెగా హీరోల సినిమాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తొందరపడకూడదని..
ఇంతవరకు పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవసి తప్పితే తెలుగులో పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసింది లేదు. తమిళ్ లో అయితే విజయ్ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న కీర్తి సురేష్ తెలుగులో మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఏ మాత్రం తొందరపడకూడదని కేవలం తనకు నచ్చిన సినిమాలనే ఓకే చేస్తోంది.

నచ్చలేదని రిజెక్ట్ చేస్తోందట..
ఇక పవన్ కళ్యాణ్ తరువాత మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సర్కారు వారి పాటలో నటించబోతోంది. ఆ సంగతి అటుంచితే.. ఇటీవల అమ్మడు కొన్ని మంచి సినిమాల్లో నటించే అవకాశం వస్తే నచ్చలేదని రిజెక్ట్ చేస్తోందట. ఇప్పటికే అందాదున్ రీమేక్ లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉంటుందని నితిన్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ మెగా హీరోలతో నుంచి వచ్చిన మరో రెండు ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిందట. అందులో అల్లు అర్జున్ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఆఫర్..
అల్లు అర్జున్ ఐకాన్ సినిమా కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే అందులో ఇద్దరు హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉందట. అందుకే ఒక హోమ్లీ హీరోయిన్ కోసం కీర్తి సురేష్ ని సంప్రదించగా ఆమె నో చెప్పేసిందట. కాస్త రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉండడమే ఆమె రిజెక్ట్ చేయడానికి కారణమని తెలుస్తోంది.
Recommended Video

గ్లామార్ గీత దాటకుండా..
కాస్త రొమాంటిక్ డోస్ ఎక్కువైనా కూడా కీర్తి సురేష్ ఒప్పుకోవడం లేదట. గ్లామార్ గీత దాటకుండా ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక అల్లు అర్జున్ తో పాటు అంతకుముందు సాయి ధరమ్ తేజ్ తో నటించే ఛాన్స్ రాగా కథ నచ్చలేదని ఒప్పుకోలేదట. మొత్తానికి కీర్తి సురేష్ సినిమాలో కాస్త కొత్తదనం ఉండి రొమాంటిక్ డోస్ లేకుంటేనే ఓకే చేబుతున్నట్లు అర్ధమవుతోంది.