Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Keerthy Suresh: స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కీర్తి సురేష్ అందాలు.. బ్యాక్ నుంచి చూపిస్తూ సోకుల విందు!
యావరేజ్ హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ తర్వాతి కాలంలో మహానటిగా ఎదిగింది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరక్కించిన మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ కీర్తి సురేష్. ఇందులో సావిత్రి పాత్రలో ఎంతగానో అలరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. అనంతరం కీర్తి సురేష్ సినిమాలు ఫ్లాప్ లు మూటగట్టుకున్న కూడా ఆమెకు ఆఫర్లు తగ్గడం మాత్రం ఆగలేదు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నిత్యం దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తోంది కీర్తి సురేష్.

ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ..
మహానటి కీర్తి సురేష్ మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, నటి మేనక కుమార్తెగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2000 సంవత్సరంలో బాల నటిగా పరిచయం అయింది కీర్తి సురేష్. అలా చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో అనేక చిత్రాలతో అలరించింది కేరళ కుట్టి.

2013లో హీరోయిన్ గా..
చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ 2013లో విడుదైలన మలయాళ సినిమా గీతాంజలి ద్వారా మొదటగా హీరోయిన్ గా పరిచయం అయింది. అనంతరం తమిళ్, తెలుగు సినీ ఆఫర్లు రావడంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన 'నేను శైలజ' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు కీర్తి సురేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

నటనకు జాతీయ అవార్డు..
'నేను శైలజ' సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది కేరళ కుట్టి కీర్తి సురేష్. అలాగే, పెద్ద హీరోలతో భారీ చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ ప్రారంభంలో అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది.

డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు..
కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే ఓకే చేస్తోంది. అయితే కీర్తి సురేష్ ఆ మధ్య ఎక్కువగా మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపింది. ఆ సినిమాలు ఫలితాలు తారామారు అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

రెండు సినిమాలతో..
గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్. ఇక ఇదంతా కాదని, ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్‌ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. అప్పటినుంచే కీర్తి సురేష్ గ్లామర్ చూపిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు రివాల్వర్ రీటా, దసరా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్.

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో..
ఎప్పుడు హోమ్లీగా కనిపంచిన కీర్తి సురేష్.. సర్కారు వారి పాట సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసేసరికి ఆమె ఫ్యాన్స్ అదే కావాలని మారాం చేస్తున్నారు. కీర్తి సురేష్ కూడా అలాగే హాట్ గా దర్శనమిస్తూ వస్తోంది. ఇటీవల మాల్దీవ్స్ లలో ఎన్నడూ కనిపించిని విధంగా హాట్ షో చేసిన కీర్తి సురేష్ తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మరింత గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పసుపు చీర కట్టుకుని తళుక్కుమంది ఈ మహానటి.
ప్రియాంక్ మోహనన్ తో కీర్తి..
సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాకు సంబంధించిన సెట్ లో ఇలా పసుపు చీరలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి బ్యాక్ అందాలను ఆరబోసింది కీర్తి సురేష్. ఆమెతోపాటు మరో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా సందడి చేసింది. పెట్ డాగ్ ను ఎత్తుకున్న కీర్తి సురేష్ తన బ్యాక్ అందాలను నవ్వుతూ ప్రదర్శించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ పాల్గొన్న సంక్రాంతి సంబురాలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.