Don't Miss!
- News
కుటుంబ స్వార్థం కోసమే బై పోల్.. రాజగోపాల్‌పై జగదీశ్ రెడ్డి విసుర్లు
- Sports
భారత్ నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇవ్వాలని ఫిక్సయ్యా.. మంచి పనికి పూనుకున్న ఏబీ డివిలియర్స్
- Technology
త్వరలో భారత్‌లోకి 180W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా గల మొబైల్!
- Lifestyle
Health Tips: Healthy Fatty Foods:ఈ కొవ్వు పదార్ధాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండెపోటును నివారిస్తాయి..
- Finance
Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు
- Automobiles
కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?
- Travel
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
‘ఖిలాడి’ హీరోయిన్ రొమాంటిక్ వీడియో వైరల్: ఎప్పుడూ చూడని విధంగా గ్లామర్ ట్రీట్
చాలా ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించలేదు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆంధ్రా, తెలంగాణకు చెందిన అమ్మాయిలు ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. తద్వారా ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బెజవాడ చిన్నది డింపుల్ హయాతి ఒకరు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాలు, ఐటెం సాంగ్స్, గ్లామర్ షోతో తెగ సందడి చేస్తోన్న ఈ సుందరాంగి.. ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా డింపుల్ ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా మొదలైన డింపుల్ కెరీర్
విజయవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. అలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో డింపుల్ 'గల్ఫ్' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో నటించింది. ఇది తెలుగు, తమిళంలో విడుదల అయింది.
షర్ట్ విప్పేసి మరీ సమీరా రెడ్డి అందాల ఆరబోత: ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా మారిందేంటి!

స్పెషల్ సాంగ్‌తో యమ పేరు
పలు సినిమాల్లో నటించినా డింపుల్ హయాతికి అంతగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో అవకాశాలు కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్ చేసింది. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. అదే సమయంలో ఈ చిన్నదానికి అవకాశాలు కూడా వచ్చాయి.

ఆ భాషల్లోనూ వరుస మూవీలు
డింపుల్ హయాతికి తెలుగుతో పాటు పలు భాషల్లోనూ సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌లో 'యురేకా' అనే సినిమాలో నటించింది. దీని తర్వాత 'అత్రంగి రే' అనే హిందీ సినిమాలోనూ కనిపించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. అంతేకాదు, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రం కూడా చేసింది. వీటితో పాటు మరికొన్ని ఆఫర్లను అందుకుంది.
నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ

ఖిలాడీలో హాట్‌గా.. చాన్స్‌లు
ఇక, డింపుల్ హయాతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా 'ఖిలాడి' మూవీని చెప్పుకోవచ్చు. రవితేజ నటించిన ఈ సినిమాలో ఈ చిన్నది అందాలను ఆరబోసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే, యాక్టింగ్ పరంగానూ బాగా మెప్పించింది. మరీ ముఖ్యంగా రెండు రకాల క్యారెక్టర్లతో ప్రేక్షకులని ఫిదా చేసింది. ఇక, ఇప్పుడు డింపుల్ శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో అవకాశం అందుకుంది.

సోషల్ మీడియాలో సందడిగా
మోడల్‌గా సందడి చేస్తోన్న సమయం నుంచే డింపుల్ హయాతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, కెరీర్ సంబంధిత అప్‌డేట్లను కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.
డ్రెస్ తీసేసి మరీ కరీనా కపూర్ రచ్చ: అబ్బో ఆ ఫోజు చూశారంటే!
అందాలను ఆరబోస్తూ రచ్చ
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందచందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఆఫర్లను దక్కించుకుంటోంది. అదే సమయంలో తన గ్లామర్ ట్రీట్‌తో తరచూ వార్తల్లో హెడ్‌లైన్ అవుతోంది.

హాట్ వీడియో షేర్ చేసింది
సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఫొటోషూట్ చేస్తోన్న విజువల్స్ కనిపించాయి. ఒక సందర్భంలో డింపుల్ లోదుస్తులు లేకుండా కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది బాగా వైరల్ అయిపోతోంది.