For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూటింగ్‌ స్పాట్‌లో హీరోయిన్ అసభ్య ప్రవర్తన: బయటపెట్టిన డైరెక్టర్.. పబ్లిక్‌లో వద్దంటూ వార్నింగ్

  |

  సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లపై జనాల ఫోకస్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్లే వాళ్లు ఏం చేసినా హాట్ టాపిక్ అయిపోతుంది. సాధారణంగా ఉండే వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. వివాదాస్పద తీరుతో వ్యవహరించే వాళ్ల పరిస్థితి ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి వారిలో కోలీవుడ్ బ్యూటీ మీరా మిథున్ ఒకరు. తన వ్యక్తిగత తీరుతో నిత్యం గొడవల్లో ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో అసభ్యంగా ప్రవర్తించింది. ఆ వివరాలను డైరెక్టర్ బయట పెట్టేశాడు.

   అలా మొదలెట్టి... ఇలా ఫేమస్

  అలా మొదలెట్టి... ఇలా ఫేమస్

  చదువులో టాప్ అయిన మీరా మిథున్.. కొరియోగ్రాఫర్ గణేష్ సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో.. చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ఫేమస్ అయింది. దీంతో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి సత్తా చాటిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. తద్వారా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించిందామె.

  హీరోయిన్‌గా మారి.. క్రేజ్ సొంతం

  హీరోయిన్‌గా మారి.. క్రేజ్ సొంతం

  మోడల్‌గా చాలా కాలం పాటు హవాను చూపించిన మీరా మిథున్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2015లో వచ్చిన ‘ఎన్నై అరిందాల్'తో హీరోయిన్ అయిన ఈ భామ.. ఆ తర్వాత ‘గఘనం', ‘8 తొట్టక్కల్', ‘తానా సెర్న్‌దా కొట్టం', ‘బాదై ఏరి బుద్ది మారి' వంటి చిత్రాలు చేసి అదరొట్టేసింది. ఫలితంగా తక్కువ సినిమాలే చేసినా గుర్తింపును మాత్రం భారీ స్థాయిలో అందుకుంది.

  వివాదాలతో సహవాసం చేస్తోంది

  వివాదాలతో సహవాసం చేస్తోంది


  గ్లామర్ ఫీల్డులో మీరా మిథున్‌ది చాలా చిన్న ప్రయాణమే అయినా.. ఆమె ఎన్నో వివాదాల్లో భాగం అయింది. మరీ ముఖ్యంగా అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోలపై కేసు పెట్టిన ఈ బ్యూటీ... హీరోయిన్లపైనా సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో తమిళనాడును నాశనం చేయమంటూ ప్రధానికి లేఖ రాసింది. ఇలా ఒకదాని తర్వాత ఒక వివాదంతో హాట్ టాపిక్ అయింది.

  ఆ దెబ్బకు సినిమాలకు దూరంగా

  ఆ దెబ్బకు సినిమాలకు దూరంగా

  కోలీవుడ్‌కు చెందిన హీరోలు, హీరోయిన్లపై విమర్శలు చేయడం వల్ల మీరా మిథున్‌పై బ్యాన్ పడిపోయింది. అప్పటి నుంచి ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అప్పుడప్పుడూ టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో మాత్రమే మెరుస్తోంది. కొందరు చిన్న దర్శకులు మీరాకు అవకాశం ఇస్తామని అప్పట్లో ప్రకటించినా.. ఆమె వ్యవహార శైలి వల్ల అవన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చిందనే చెప్పాలి.

  షూటింగ్ స్పాట్‌లో అసభ్య ప్రవర్తన

  షూటింగ్ స్పాట్‌లో అసభ్య ప్రవర్తన

  చాలా కాలం తర్వాత ప్రస్తుతం మీరా మిథున్ ‘పేయైు కాణోమ్‌' అనే సినిమాలో నటిస్తోంది. అన్బరసన్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కౌశిక్ అనే కుర్రాడు హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మీరా మిథున్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమె సిగరెట్ కాల్చుతూ కెమెరాల కంటికి చిక్కడమే అని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఏం చేసిందో వెల్లడించిన కొత్త డైరెక్టర్

  ఏం చేసిందో వెల్లడించిన కొత్త డైరెక్టర్

  షూటింగ్ స్పాట్‌లో జరిగిన విషయాన్ని దర్శకుడు వెల్లడిస్తూ.. ‘మీరా సిగరెట్‌ కాల్చడం ఆమె పర్సనల్. కానీ షూటింగ్‌ అలా చేయడం సరికాదు. ఈ విషయాన్ని ఆమెకు స్వయంగా చెప్పాను. అంతేకాదు, కేరావాన్‌లో అలాంటివి చేయాలని సూచించాను. అప్పటి నుంచి తను ఆ పని మళ్లీ చేయలేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

  English summary
  Kollywood Actress, 8 Thottakkal Fame Meera Mitun Now Doing One Movie. Recently She Went for Shoot. Then She Smoked Cigarette at Shooting Spot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X