Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కొత్త బాయ్‌ఫ్రెండుతో ఎంజాయ్ చేస్తూ... టైగర్ ష్రాఫ్ సోదరి ఫోటోస్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ సినిమా రంగానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆమె గురించి మీడియాలో హాట్ న్యూస్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కృష్ణా ష్రాఫ్... తన సెక్సీ పోస్టులతో లక్షల్లో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా కృష్ణా ష్రాఫ్ కొత్త బాయ్ ఫ్రెండ్ గురించిన వార్త చర్చనీయాంశం అయింది. పారస్ నాయల్ అనే వ్యక్తితో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆమె బర్త్ డే సందర్భంగా విష్ చేస్తూ పారస్ నాయల్ కొన్ని ఫోటోస్ పోస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం.

పీకల్లోతు ప్రేమలో..
‘‘హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్! నువ్వు నాతో పాటు ఉంటే ప్రతి ఒక్కటి అమేజింగ్‌గా ఉంటుంది'' అంటూ పారస్ నాయల్ తన ప్రియురాలు కృష్ణా ష్రాఫ్‌ను ముద్దాడుతున్న ఫోటో పోస్టు చేశారు.

ఎవరీ పారస్ నాయల్
పారస్ నాయల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే... ఇతడొక సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్, కృష్ణా ష్రాఫ్ సైతం ఇతడి వద్దే ఫిట్‌నెస్ శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో పారస్ నాయల్, కృష్ణా ష్రాఫ్ మధ్య ప్రేమ మొదలైనట్లు టాక్.

ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్
ష్రాఫ్ ఫ్యామిలీతో కూడా పారస్ నాయల్ చాలా సన్నిహితంగా మెలుగుతుండటంతో వీరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు కూడా తెలుసని స్పష్టమవుతోంది. కృష్ణా ష్రాఫ్‌ను విష్ చేస్తూ చేసి పోస్టుతో పారస్ నాయల్ ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు.

కృష్ణా ష్రాఫ్
తన తండ్రి, సోదరుడు సినిమా రంగంలో రాణిస్తున్నప్పటికీ కృష్ణ ష్రాఫ్ మాత్రం ఇటు వైపు రావడానికి ఇష్టపడటం లేదు. ఆమె సినిమాల్లో నటించడం కంటే ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.