మహేష్ హీరోయిన్ లక్కు మామూలుగా లేదు.. పెద్ద సినిమాలనే పట్టేసింది!
కొంతమంది హీరోయిన్స్ కెరీర్ మొదట్లో అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాత చాలా కష్టపడి కింద స్థాయి నుంచి వస్తుంటారు. అందం ఎంత ఉన్నా కూడా స్టోరీ సెలక్షన్ యాక్టింగ్ అనేది చాలా ముఖ్యమని రెండు మూడు అపజయాల తరువాత గాని అర్థం కాదు. పూజా హెగ్డే కెరీర్ కూడా దాదాపు అలానే నడిచింది. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ కృతి సనోన్ కూడా దాదాపు అదే తరహాలో నిలదొక్కుకుంది. మొదటి సినిమానే డిజాస్టర్ అవ్వడంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు చాలా తక్కువగానే వచ్చాయి. ఇక వచ్చిన వాటిల్లోనే మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది.

గత కొంత కాలంగా కృతి పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో ఏడు సినిమాలున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో పాటు హిందీలో గణపత్, భెడియా, మిమీ, బచపన్ పాండే, హమ్ దో హమారే దో వంటి బిగ్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇంకా టైటిల్ సెట్ కానీ మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు హిట్టయితే చాలు అమ్మడి రేంజ్ మరొక లెవెల్ కు వెళ్లిపోయినట్లే. మరి ఆ సినిమాలు ఏ స్థాయిలో హిట్టవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











