For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరుదైన వ్యాధితో బాధ పడుతున్న లావణ్య త్రిపాఠి.. వాటిని చూస్తేనే వణుకు అంటూ సీక్రెట్ రివీల్!

  |

  సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా వారి ఆస్తులు, వారి అఫైర్స్ వారి ఆరోగ్యం ఇలా ప్రతి విషయంలో అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయాల గురించి త్వరగా బయటకు చెప్పుకోవడానికి సినీ సెలబ్రిటీలు అంతగా ఆసక్తి చూపించరు. కానీ తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తాను జబ్బుతో బాధపడుతున్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  MS Dhoni తో ఇళయదళపతి విజయ్... సోషల్ మీడియాలో కిరాక్ పుట్టిస్తున్న ఫోటోలు

  అందాల రాక్షసి

  అందాల రాక్షసి

  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు లావణ్య త్రిపాఠి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య లో జన్మించిన లావణ్య త్రిపాఠి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో పెరిగి పెద్ద అయ్యారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆమె తండ్రి లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు అయితే డెహ్రాడూన్లో చదువు పూర్తి చేసుకుని ఆమె సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు.

  అక్కడే పై చదువులు కూడా పూర్తి చేశారు. అయితే అనూహ్యంగా 2012వ సంవత్సరంలో అందాల రాక్షసి సినిమాతో ఆమె తెరంగ్రేటం చేశారు. ఆమె స్నేహితురాలు ఒకరు ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలపడంతో హైదరాబాద్ వచ్చి ఆమె ఆడిషన్స్ కి అటెండ్ అయ్యారు. అలా మొదటి సినిమా అవకాశం దక్కించుకున్న ఆమె ఆ సినిమాలో మిధున అనే పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకోవడమే కాక అవార్డులు కూడా దక్కించుకున్నారు. అదే ఏడాది దూసుకెళ్తా అనే సినిమాలో అవకాశం రాగా మరుసటి ఏడాది ఆ సినిమా రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది.

  Bigg Boss OTT భామ నేహా భాసిన్.. మత్తెక్కించే అందాలతో హంగామా!

  వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చి పడతాయి ఏమో అని భావిస్తున్న క్రమంలో ఆమెకు తమిళ్ లో ఒక అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా అంత పెద్ద గా పేరు తెచ్చి పెట్టలేదు. కానీ అక్కినేని ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం మాత్రం దక్కింది.. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అర్జున్ సురవరం, ఏ వన్ ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా అనే సినిమాలతో ఆమె కాస్త బిజీ గానే ఉంది.

  కానీ ఇది దాదాపు చాలా సినిమాలు ఆమె చేసినవన్నీ హిట్స్ కాకుండా ఉండటంతో ఆమెకు వెంటవెంటనే అవకాశాలు అయితే వచ్చి పడటం లేదు. ప్రస్తుతానికి సినిమాలు కూడా పెద్దగా ఒప్పుకున్న దాఖలాలు లేవు కానీ ఆమె నటించిన రెండు సినిమాలు మాత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తాజాగా సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చిన ఆమె వెల్లడించింది.

  Adah Sharma బికినీ అందాలన్నీ ఒక్క చోట.. చిన్నప్పటి నుంచీ ఇప్పటిదాకా!

  మీ ముందుకు

  మీ ముందుకు

  ప్రస్తుతం తాను చిన్న గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే ఒక మంచి కథ తో మీ ముందుకు రాబోతున్నా అని అలాగే కొన్ని సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను అని వెల్లడించింది.. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ స్టేషన్ లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి అభిమానులతో మాట్లాడుతూ నెటిజన్లు అడిగిన దాదాపు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నప్పుడే మన జీవనశైలి సక్రమంగా ఉంటుందని ఆమె వెల్లడించింది.

   చాలా రోజులుగా బాధ పడుతూ

  చాలా రోజులుగా బాధ పడుతూ

  ఇదే సమయంలో తనకు ట్రిపో ఫోబియా అనే ఒక సమస్య ఉందని కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని ఆకారాలు, వస్తువులను చూస్తే తెలియకుండా భయం పుడుతుందని, చాలా రోజులుగా ఈ ఫోబియాతో బాధపడుతున్నానని ఆమె వెల్లడించారు. అంతేకాక దీని నుంచి బయట పడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నా అని ఆమె వెల్లడించారు. ఇక ప్రపంచంలో అనేక రకాల భయాలు ఉన్నాయి. కొందరు సాలె పురుగులకు భయపడతారు, కొందరు నీటికి భయపడతారు.

  అసలు ఏమైంది అంటే

  అసలు ఏమైంది అంటే

  దాదాపు ప్రతి మానవుడు ఏదో ఒక రకమైన భయానికి గురవుతున్నాడని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇలాంటి చిన్న విషయాలకు భయపడే కొందరు వ్యక్తులు ఉన్నారు అంటే నమ్మక తప్పదు. చిన్న రంధ్రాలు చూసి భయపడే ఇలాంటి వ్యక్తులలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. ఇక ఇలాంటి ఫోబియాలు ఉన్న వ్యక్తులు చాలా ఎక్కువ మందే ఉంటారని అంచనా. ఇక ఒక కప్పు కాఫీలో బుడగలు పెరగడం చూసి కూడా కొంతమంది అసౌకర్యానికి గురవుతారని తాజా అధ్యయనంలో తేలింది. ఆ వ్యక్తులు ట్రిపో ఫోబియా అని పిలువబడే వింత ఫోబియాతో బాధపడుతున్నారని చెప్పచ్చు.

  #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు
  అసలు ట్రిపో ఫోబియా అంటే

  అసలు ట్రిపో ఫోబియా అంటే

  ఒక రకంగా ట్రిపో ఫోబియా అంటే ఒక రకమైన రంధ్రాల భయం. ఈ భయం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఉంది మరియు వారిలో చాలా మంది రౌండ్ హోల్స్ ఉన్న వస్తువులను చూసి భయపడతారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ట్రిపో ఫోబియా యొక్క అసలు కారణాన్ని వెల్లడించారు. నిజానికి, చాలా అంటు వ్యాధులు బాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల కలుగుతాయి.

  చికెన్ పాక్స్, మీజిల్స్ మరియు షింగిల్స్ వంటి ఈ వ్యాధుల లక్షణాలు రౌండ్ హోల్స్ రూపంలో కనిపిస్తాయి. ట్రిపో ఫోబియాతో బాధపడుతున్న వ్యక్తులు బుడగలు లేదా ఏదైనా చిన్న వస్తువులు చూసినప్పుడు, వారికి ఈ వ్యాధులు గుర్తుకు వస్తాయి. ఈ కారణంగా, వారి శరీరంలో వణుకు ప్రారంభమవుతుంది.

  English summary
  Lavanya Tripathi has revealed that she has a rare disease called Triphobia.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X