’గట్టిగా కొరికే మగాళ్ల కంటే.. అలా ముద్దు పెట్టుకొనే పురుషులంటే పడి చస్తా’
బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్, బ్రేకప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇక బోల్డ్ కామెంట్స్‌తోనూ మలైకా అరోరా వార్తల్లో నిలుస్తుంటారు. కొద్దిరోజుల క్రితం రిలేషన్, రొమాన్స్ విషయంలో ఆమె చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. ఈ వివరాల్లోకి వెళితే..
అర్భాజ్ ఖాన్‌కు విడాకులు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మలైకా. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ సినిమాలతో మన కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చారు. సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మలైకా అరోరా. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ల పాటు వీరి కాపురం సజావుగానే జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ మలైకా- అర్బాజ్‌లు విడిపోయారు.

అర్జున్ కపూర్‌తో బ్రేకప్
కొన్నాళ్లు ఒంటరిగానే జీవించిన మలైకా .. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగించడం హాట్ టాపిక్‌గా మారింది. మలైకా కంటే అర్జున్ దాదాపు 12 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. కరోనా లాక్‌డౌన్ సమయంలో మలైకా - అర్జున్ కపూర్‌లు ఒకే ఫ్లాట్‌లో ఉంటూ సహజీవనం సాగించారని బాలీవుడ్ కోడై కూసింది. ఒకానొక దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అర్జున్ కపూర్ - మలైకా అరోరాలు విడిపోయారు.
కొడుకు వయసున్న కుర్రాడితో ప్రేమాయణం
అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా పలువురితో ఆమె డేటింగ్ చేస్తుందనే కామెంట్స్ వినిపించాయి. ఒకదశలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరతోనూ మలైకా ప్రేమాయణం సాగిస్తున్నారన్న గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌లో సంగక్కర - మలైకాలు క్లోజ్‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం ఇందుకు బలాన్ని చేకూర్చాయి. ఇక ఇటీవల ముంబైలో గ్రామీ అవార్డ్ విజేత ఎన్రిఖ్ ఇగ్లేసియాస్ నిర్వహించిన కన్సర్ట్‌లో 33 ఏళ్ల కుర్రాడు, వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మరోసారి షాకిచ్చారు మలైకా. 52 ఏళ్ల వయసులో ఆమె మరోసారి ప్రేమాయణం సాగిస్తున్నారన్న గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ వ్యవహారంపై హర్ష్, మలైకాలు ఇంత వరకు స్పందించలేదు.
అలాంటి మగాళ్లు ఇష్టం
52 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందంతో మెరిసిపోతున్నారు మలైకా అరోరా. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని రేంజ్‌లో హాట్ హాట్ ఫోటో షూట్‌లతో గిలిగింతలు పెడుతుంటారు. ఏ విషయంపై అయినా మొహమాటం లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం మలైకా స్టైల్. ఈ క్రమంలోనే 2021లో ఓ రియాలిటీ షోలో రొమాన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ హాట్ బ్యూటీ. అందంగా, క్లీన్ సేవ్ చేసుకున్న వాళ్ల కంటే రఫ్‌గా ఉండే మగాళ్లు అంటేనే నాకు ఇష్టం. రొమాన్స్‌లో కాస్త ఘాటుగా బిహేవ్ చేయాలి, కసిగా ముద్దు పెట్టుకోవడం తెలిసిన వ్యక్తి ఇష్టమని మలైకా అరోరా తన మనసులోని మాటను చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించగా.. తాజాగా మలైకా తాలూకా వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











