Just In
- 8 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 20 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 41 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రాలింగ్ పై వెనక్కుతగ్గని మాళవిక... పిట్ట కొత్తదైనా ఘట్టిదే మరి...
మళయాళీ భామ మాళవికా మోహనన్ పేరు ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లోనూ బాగానే చక్కర్లు కొడుతోంది. బియాండ్ క్లౌడ్స్ అనే అంతర్జాతీయ సినిమాలో దీపికా పదుకోనేను రీప్లేస్ చేసి వార్తలకు ఎక్కిన ఈ కేరళకుట్టి, ఇప్పుడు స్టార్ హీరోలతో జోడీకట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే కోలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ను పట్టేసిన మాళవిక, సోషల్ మీడియా ట్రాలింగ్ కు మాత్రం అసలు తలొగ్గేది లేదంటోంది.
కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ తదుపరి చిత్రం మాస్టర్ లో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక, ప్రస్తుతం ఘాటు ఫొటోషూట్ లతోనూ, ట్రండింగ్ ఛాలెంజ్ లతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా గడిపేస్తోంది. షూటింగ్ లు లేకపోవడంతో దొరికిన టైమ్ ను చక్కగా వినియోగించుకుంటోన్న మాళవిక కూడా ట్రాలింగ్ బారిన పడింది. కానీ, అందరి లాగా అమ్మడు ఈ అంశంపై మిన్నకుండిపోలేదు. తనపై వస్తున్న ట్రాలింగ్స్ చెక్ పెట్టేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగింది.

ముక్కుముఖం తెలియని ఇంపోస్టర్ల ట్రాల్స్ కు గట్టి సమాధానమే ఇస్తోంది మాళవిక. అసలు ఈమె ఇప్పటివరకూ పెద్ద సినిమాల్లోనే నటించలేదు. ఆమెకెందుకు అంత హైప్ అంటూ ట్రాల్ చేయబోయినవారికి, పెద్ద సినిమాల్లో నటించలేదు కాబట్టే, ఇంత క్రేజ్ ఉంది అంటూ చక్కని సమాధానమే ఇచ్చింది.
ఇక అమ్మడి ఇన్స్టా అకౌంట్ నిండా ఇలాంటి సమాధానాలు చాలానే ఉన్నాయి. ఏమైనా తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందు ప్రయత్నించే వారికి అమ్మడి గట్టిగానే ఇస్తోంది. కాబట్టి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అమ్మడికి పెద్ద కష్టమేమీ కాదు సుమీ.