భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే!

సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన అంత్యక్రియలు ఎట్టకేలకు చెన్నైలో ముగిశాయి. ఈ అంత్యక్రియలు అన్ని తానై నిర్వహించారు మీనా. స్వయంగా మీనా దహన సంస్కారాలు కూడా నిర్వహించడం పలువురిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే

2009వ సంవత్సరంలో వివాహం

2009వ సంవత్సరంలో వివాహం

తెలుగు సహా దక్షిణాది సినిమాలలో నటించి మంచి హీరోయిన్ గా స్థిరపడిన మీనా కాస్త ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను 2009వ సంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరి వివాహం తరువాత మీనా భర్త ఉద్యోగం మానివేసి వ్యాపారాలు చేస్తూ మంచి బిజినెస్ మాన్ గా ఎదిగారు. వారికి కూతురు జన్మించిన తర్వాత మీనా రీఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది అలాగే వారి కుమార్తె కూడా పలు సినిమాలలో నటించి బాలనటిగా మంచి పేరు సంపాదించింది.

అనూహ్య పరిస్థితుల్లో

అనూహ్య పరిస్థితుల్లో

అయితే వీరి కుటుంబం మొత్తం కూడా జనవరి నెలలో కరోనా బారిన పడింది. కుటుంబం అంతా కరోనా నుంచి కోలుకున్న తర్వాత విద్యాసాగర్ ఊపిరితిత్తులకు మాత్రం ఇన్ఫెక్షన్ ఏర్పడింది. పావురాల వ్యర్ధాల మీదుగా వచ్చిన గాలి పీల్చడం వల్ల ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఏర్పడింది అని వైద్యులు గుర్తించారు. ఆయన ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో వాటిని మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎవరైనా బ్రెయిన్ డెడ్ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకు వస్తే వీలైనంత త్వరగా మార్చాలని ఎదురు చూశారు కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు.

అభయం ఇచ్చి

అభయం ఇచ్చి

తొలుత సీరియస్ గా ఉందని మీడియాకు సమాచారం అందింది. తరువాత ఆయన మరణించారనే సమాచారం బయటకు వచ్చింది. అయితే ఆయన అంత్యక్రియలు చెన్నైలోని మీనా స్వగృహంలో నిర్వహించారు. మీనాకు ఒక కుమార్తె ఉండడంతో కొడుకు ఎవరూ లేకపోవడంతో మీనా స్వయంగా తన భర్త అంత్యక్రియలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక వీరి కుటుంబాన్ని పరామర్శించేందుకు తమిళ సినీ పరిశ్రమ నుంచి అనేకమంది సినీ ప్రముఖులు తరలివచ్చారు. రజనీకాంత్, శరత్ కుమార్ వంటి వారు మీనా దగ్గరకు వెళ్లి ఆమెకు అభయం ఇచ్చి ఓదార్చారు.

దుఃఖ వదనంతో

దుఃఖ వదనంతో

అయితే సాధారణంగా అంత్యక్రియల విషయంలో మగవాళ్లే ఆ బాధ్యతలు చూస్తూ ఉంటారు కానీ మీనా అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించడం అక్కడికి వచ్చిన వారందరికీ కంటతడి పెట్టించింది. మామూలుగానే మీనాకు తన కుటుంబం అంటే చాలా ఇష్టం అని అనేక సందర్భాలలో చెబుతూ ఉండేవారు. బహుశా అందువల్లనే తన భర్త దహన సంస్కారాలు తానే చేయాలని ఉద్దేశంతో చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇక చిన్నారి నైనిక కూడా తన తండ్రిని కోల్పోవడంతో చాలా దుఃఖం వదనంతో కనిపించింది.

కంటతడి

కంటతడి

మీనా ఆమె కుమార్తెను తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రముఖులు ఓదార్చి మేమున్నామని ధైర్యం చెప్పారు. మీనా ఇంటి దగ్గరున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల అంతిమ నివాళులర్పించేందుకు ఉదయం నుంచి ఆయన భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని దహన సంస్కారాల నిమిత్తం బీసెంట్‌నగర్‌కు తరలించారు. దహన సంస్కారానికి ముందు, మీనా మరియు ఆమె కుమార్తె నైనిక వారి ఇంటి వెలుపల అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X