twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యాక్సిన్ కోసం ఫేక్ ఐడి సృష్టించిన హీరోయిన్.. అసలు సీక్రెట్ బయటపెట్టింది !

    |

    కరోనా వైరస్ కల్లోలం ఆగడం లేదు. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతూ అందరికీ టెన్షన్ పెడుతున్నాయి. మొదటి వేవ్ కంటే దారుణంగా ఉన్న ఈ సెకండ్ వేవ్ ఈ సారి సెలబ్రిటీలు, సినిమా వాళ్ళను కూడా వదలడం లేదు. ఇక రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతుండడంతో జనాలు వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. అయితే ఆ వ్యాక్సిన్ సెలబ్రిటీలకు, రాజకీయనాయకులకి దొరికినంత తేలికగా సామాన్య ప్రజలకు దొరకడం లేదనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది.

    తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్న ఆమె దానికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. థానేలో పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వ్యాక్సిన్ వేయించుకున్న ఆమె ఓం సాయి ఆరోగ్య కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆమె సూపర్ వైజర్ గా పని చేస్తున్నట్లు ఓ ఫేక్ ఐడి క్రియేట్ చేశారని ప్రచారం జరిగింది.

    Meera Chopra denies allegations on ID floating on social media

    ఈ విషయంపై స్పందించిన థానే మున్సిపల్ కార్పొరేషన్.. విచారణ చేస్తున్నామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రా పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో మీరా ఈ వ్యాక్సినేషన్ పోస్ట్ ను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అయితే తాజాగా ఈ ఆరోపణలను ఖండించడానికి సోషల్ మీడియా ముందుకు వచ్చింది. తన మొదటి టీకాను థానే ఆసుపత్రిలో అందుకున్నానని గుర్తింపు కార్డు మరియు ఒక పాస్పోర్ట్ ఫోటోను కూడా టీకా కేంద్రానికి ఇచ్చినట్లు మీరా వెల్లడించింది. సోషల్ మీడియాలో తేలియాడుతున్న ఐడి నాది కాదన్న ఆమె, రిజిస్ట్రేషన్ కోసం నా ఆధార్ కార్డు అడిగారు, నేను ఇచ్చిన ఏకైక ఐడీ అదేనని అన్నారు. ఆ ఫేక్ ఐడి కార్డ్ ని ట్విట్టర్‌లో వచ్చినప్పుడు నేను చూశానని అది ఎవరు చేశారో తనకు తెలియదని అన్నారు.

    English summary
    Actress Meera Chopra announced on social media that she had received her first jab. Some sources revealed on social media that Meera had been registered as a front line worker. so that Maharashtra govt allowed her to get vaccinated on priority. recently she denies allegations on ID floating on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X