పెళ్లి తరువాత చేస్తున్న ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన నిహారిక.. వైష్ణవ్ ముద్దు పేరు ఇదే!
మెగా వారసత్వం నుంచి వచ్చిన యువ హీరోలు ప్రతి ఒక్కరు వారికంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఆ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఎదో విధంగా సినిమాలతో బిజీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సైరా సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ ను కూడా స్టార్ట్ చేసి వెబ్ కంటెంట్ లపై దృష్టి పెట్టింది.
ఇక నాగబాబు డాటర్ నిహారిక కూడా తనదైన శైలిలో యాంకర్ గా నటిగా హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక మళ్ళీ సినిమాల్లో నటిస్తుందయా లేదా అని సందేహం కలుగుతున్న సమయంలో నటిగా బిజిగానే ఉంటానని చెప్పింది.

ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు కూడా వివరణ ఇచ్చింది. అందులో అనసూయా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అలాగే మరొక వెబ్ సీరీస్ ని నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ఆ వెబ్ కంటెంట్ డిఫరెంట్ లవ్ ఎమోషన్స్ తో సరికొత్తగా ఉంటుందట. ఇక వైష్ణవ్ తేజ్ కు పెట్టిన ముద్దు పేరు గురించి చెబుతూ.. ఉప్పెన రిలీజ్ కంటే ముందు హీరో బాబు అని నిక్ నేమ్ సెట్ చేసినట్లు వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











