అత్యంత ప్రమాదకరమైన స్త్రీ మీ మీద ఆధారపడదు.. మెహ్రీన్ ఆసక్తికర పోస్ట్!
హీరోయిన్ మెహరీన్ కౌర్ ఎంగేజ్మెంట్ కూడా అయిన తర్వాత బ్రేక్ అప్ చేసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లోకెక్కిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.. అయితే తాను బ్రేకప్ చేసుకుంటున్నా అని పేర్కొన్న ఈ భామ అది తన పర్సనల్ విషయం అని ఇకమీదట దీని గురించి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ అంశం మీద స్పందించిన భవ్య కూడా తాను ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు చెప్పుకొచ్చాడు..
అయితే ఇప్పుడు మెహరీన్ తాజాగా చేసిన ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడి ఉందని ఎందుకంటే ఆమెకు సొంతంగానే ఒక కత్తి కలిగి ఉంటుందని చెప్పుకొచ్చింది.. కాస్త గందరగోళంగా ఉన్నా అతను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని చెప్పుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే భవ్య భిష్నోయ్ ఇంట్లో మెహరీన్ సినిమాల్లో నటించడం ఇష్టం లేదని పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు ఆపేయాలని వారు కోరడం తోనే పెళ్లి క్యాన్సిల్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది..

అయితే సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ కావడంతో వీరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అనేది పెద్ద విషయమే కాదు. కానీ భవ్య రాజకీయ నాయకుడు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రస్తుతం ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక మెహరీన్ కూడా వరుస సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఎఫ్2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక్కటే ఉంది, అయితే ఆమె బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ అనే ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ఆమె ప్రకటించగానే కాస్త క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో అయినా సినిమాలు లభిస్తాయి ఏమో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











