మెహ్రీన్ లక్కు మామూలుగా లేదు.. చిన్న సినిమా కోసం సాలీడ్ రెమ్యునరేషన్

నేటితరం హీరోయిన్స్ మధ్య పోటీ అనేది చాలా గట్టిగానే కొనసాగుతోంది. ఒకరి తరువాత మరొకరు వరుస బాక్సాఫీస్ హిట్స్ తో నెంబర్ వన్ స్థానం కోసం ఎగబడుతున్నారు. ఈ మధ్య సీనియర్ల హవా తగ్గిందని అనుకుంటున్న తరుణంలో సమంత , కాజల్ మళ్ళీ స్పీడ్ పెంచనున్నట్లు అర్ధమవుతోంది. ఇక నేటితరం హీరోయిన్స్ లలో పూజా హెగ్డే, రష్మిక మందన్న రోజురోజుకు వారి క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.

ఇక కెరీర్ లో ఇంకా అనుకున్నంత స్థాయిలో సెట్టవ్వని గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కూడా ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. దాదాపు ఒక రెండు నెలల గ్యాప్ కొనే ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సక్సెస్ రేటును ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.

Mehrene Kaur Pirzada solid remuneration for his upcoming movie

ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ కూడా F3 పైనే ఉన్నాయి. అయితే సక్సెస్ రెటు ఎక్కువగా లేకపోయినప్పటికీ మెహ్రీన్ పిర్జాదా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. మారుతి రాసిన ఒక కథకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దాని కోసం 50లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే మరొక రెండు ఆఫర్స్ కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫర్స్ రాకపోయినా పరవాలేదు గాని రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మెట్టు దిగి తన రేంజ్ ను తగ్గించుకోవాలని అనుకోవడం లేదట. ఇక F3 హిట్టయితే మెహ్రీన్ డిమాండ్ మరింత పెరిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X