Nayanatara సూపర్ థ్రిల్లర్‌తో లేడి సూపర్ స్టార్.. కనెక్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం కనెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో రీలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఇంటెన్స్‌తోపాటు హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళితే..
నయనతార, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ నటించిన కనెక్ట్ చిత్రం న్యూఏజ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్వకత్వం వహించారు. ఇప్పటికే మయూరి, గేమ్ ఓవర్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అశ్విన్ మరో ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందించారు. బలమైన కంటెంట్, అద్బుతమైన నటీనటుల మేళవింపుతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ అడుగు ముందుకేసింది.

దక్షిణాదిలో నయనతారకు మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. ఆమెకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు సినీ అభిమానులకు ఈ సినిమాను అందించే ప్రయత్నం యూవీ క్రియేషన్ చేస్తున్నది. ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గాడ్‌ఫాదర్ సినిమా రిలీజ్ తర్వాత నయనతార నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఇక నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారి రౌడీ బ్యానర్‌పై రూపొందించిన కనెక్ట్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. నయనతార ఇంటెన్స్ లుక్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. కార్తీకేయ 2 తర్వాత ఆ స్థాయిలో అనుపమ్ ఖేర్ నటించినట్టు ట్రైలర్‌లో ఆయన పాత్ర స్పష్టం చేసింది. హారర్, థ్రిల్లర్ అంశాలతో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











