Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jr NTR రిహార్సల్స్ చేయడు, బాలకృష్ణ అంతకుమించి.. ప్రభాస్ ఏమో అలా.. నయనతార కామెంట్స్
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్‌గా స్టార్డమ్ సంపాందించుకుంది. ఇప్పటికే అనేక చిత్రాల్లో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కనెక్ట్ అనే హారర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టనుంది. డిసెంబర్ 22న అంటే రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది ముద్దుగుమ్మ నయనతార. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు..
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న నయన తార పెళ్లి తర్వాత పూర్తిగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది నయన్. మాయ, గేమ్ ఓవర్ సినిమాల దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నయనతారతోపాటు వాన సినిమా హీరో వినయ్ రాయ్, సత్యరాజ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు..
సుమారు 99 నిమిషాల పాటు ఉండే నయన తార హారర్ కనెక్ట్ మూవీని విడుదల చేయమని తమిళనాడులో థియేటర్స్ ఓనర్స్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయనతార పలు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార.

చిన్న పిల్లాడి మనస్తత్వం..
"పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. తనది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ తనతో కలిసి నటించినప్పుడు మాత్రం చుట్టూ ఎగురుతూ, జోకులు వేస్తూ ఉండేవాడు. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని నయనతార తెలిపింది.

అలా చేసే ఏకైక హీరో తారక్..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ తారక్ పెద్ద అల్లరోడని చెప్పుకొచ్చింది నయనతార. "ఒకరోజు మేకప్ టచప్ చేసుకుంటుంటే ఎందుకని అడిగాడు. షాట్ కి సిద్ధమవుతున్నా అని చెబితే.. అక్కడ నిన్ను ఎవరూ చూడరు. అందరూ నన్నే చూస్తారని ఆట పట్టించాడు. కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ కోసం, పాత్ర కోసం మార్చుకునే విధానం చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. అతను ప్రాక్టీస్ చేయడం ఎప్పుడూ చూడలేదు. రిహార్సల్స్ చేయని ఏకైక హీరో అతనే" అని పేర్కొంది.

సంతోషకరమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు..
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య బాబు వీళ్లిద్దరి కంటే అల్లరి చేసేవారని చెప్పుకొచ్చింద నయనతార. చాల మంది బాలకృష్ణను చూసి భయపడతారు కానీ, చాలా జోవియల్ మనిషి అని నయన్ పేర్కొంది. ఆమె చూసిన అత్యంత సంతోషకరమైన వ్యక్తుల్లో బాలకృష్ణ సర్ ఒకరని, ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సరదాగా ఉండేదని నయనతార వివరించింది.

బాలకృష్ణతో 3 సినిమాలు..
ప్రభాస్ తో నయనతార యోగి సినిమా చేయగా.. ఎన్టీఆర్ తో అదుర్స్ చేసింది. ఇక బాలకృష్ణతో శ్రీరామ రాజ్యం, సింహా, జయసింహా మూడు సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే కనెక్ట్ మూవీ డిసెంబర్ 22న తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. హిందీలో డిసెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్ ను తెలుగులో యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తోంది.