హీరోయిన్స్ లలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్.. నయన్ డిమాండ్ మామూలుగా లేదు!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు గ్లామరస్ బ్యూటీస్ డామినేట్ చేస్తుండడంతో పాతవాళ్లకు అవకాశాలు తగ్గుతున్నాయి. అయితే కొంతమంది సీనియర్ హీరోయిన్స్ మాత్రం కొత్తవాళ్ళు వస్తే ఏ మాత్రం తగ్గడం లేదు. అదే ఎనర్జీతో ముందుకు వెళుతున్నారు. ఇక నయనతార కూడా ప్రస్తుతం సౌత్ లో అత్యదిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి వెళుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా ఇటీవల ఒక ఆఫర్ వచ్చినట్లు టాక్ వచ్చింది.

డిజాస్టర్స్ వచ్చినా కూడా

డిజాస్టర్స్ వచ్చినా కూడా

కేవలం గ్లామర్ ఉన్నంత మాత్రాన సినిమా ప్రపంచంలో ఎక్కువ కాలం నిలదోక్కుకోలేరు. మంచి నటన కథల సెలక్షన్ లో కూడా రాటుదేలి ఉండాలి. డిజాస్టర్స్ వచ్చినా కూడా ఎలా నిలదొక్కుకోవాలో తెలిసి ఉండాలి. ఆ విషయంలో నయన్ బెస్ట్ అని చెప్పవచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఛాన్సులు అందుకుంటోంది.

రూమర్లు ఎన్ని వచ్చినా

రూమర్లు ఎన్ని వచ్చినా

అలాగే నయన్ లో ఉన్న మరొక గొప్ప విషయం ఏమిటంటే పర్సనల్ లైఫ్ లో లవ్ ఎఫైర్స్ తో సతమతమయినప్పటికి ఏనాడు కూడా ఆ ప్రభావాన్ని సినిమాలపై పడనిచ్చేది కాదు. ఇక మీడియాలో రూమర్లు ఎన్ని వచ్చినా కూడా వాటి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది.

సినిమాలను బట్టి రెమ్యునరేషన్

సినిమాలను బట్టి రెమ్యునరేషన్

ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా నయనతార ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఎక్కువగా నయన్ సినిమాలను బట్టి కథ నచ్చితే తక్కువైనా తీసుకుంటుందట. ఇక సాధారణంగా ఒక సినిమాకు మార్కెట్ ప్రకారం 4 నుంచి 5కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇక బాలీవుడ్ నుంచి ఇటీవల ఒక ఆఫర్ రాగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

ఇదే నిజమైతే...

ఇదే నిజమైతే...

అట్లీ - షారుక్ ఖాన్ సినిమాలో నటించే ఆఫర్ పై చర్చలు జరుగుతుండగా.. ఆ సినిమాకు అమ్మడు 7కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ రేంజ్ లో వస్తే మాత్రం ప్రస్తుతం టాప్ నెంబర్ వన్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్నట్లే అని కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X