Don't Miss!
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
హ్యాట్సాఫ్ : 'ప్రేమను పంచుతా'నంటున్న నిధి అగర్వాల్.. ఆ వెబ్‌సైట్ లోకి వెళ్లి డీటైల్స్ ఇస్తే చాలు!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంత మేరకు అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దేశమంతా దాదాపు లాక్ డౌన్ లో ఉంది. ఈ సమయంలో సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తనకు తోచిన సహాయం చేస్తూ అందరికీ అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి సోనూసూద్, చిరంజీవి, హీరో నిఖిల్, నటుడు జీవన్ కుమార్ వంటి వాళ్ళు ముందుకు వచ్చి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది కూడా కరోనా సమయంలో తన వంతు సాయం అందించిన నిధి అగర్వాల్ ఇప్పుడు తాజాగా డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఇలాంటి కరోనా సమయంలో ఎవరైనా సహాయం కావాలి అనుకుంటే ఒక వెబ్‌సైట్ ద్వారా ఆ ఆర్గనైజేషన్ కి రిక్వెస్ట్ పెట్టొచ్చు.. ఇక ఆ వెబ్‌సైట్ ద్వారా తమ దృష్టికి వచ్చిన అన్ని అంశాల మీద తనకు చేతనైన సాయం చేస్తానని నిత్యావసరాలు, మందులు ఇలా ఏవైనా సరే సాయం చేయడానికి నేను సిద్ధమని నిధి అగర్వాల్ ప్రకటించింది.

ఈ ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పనిచేస్తుందని పేర్కొన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే అభ్యర్థనలను అన్నిటినీ పరిశీలిస్తామని వాటిని పరిశీలించాక ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్ల సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఎంపికైంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే దాని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.