మహేష్ సినిమాని వాడుతూ నిహారిక ఆసక్తికర పోస్ట్.. వాళ్ళసలు మాట్లాడకూడదట!

మెగా కుటుంబంలో నాగబాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల నటిగా అనేక ప్రయత్నాలు చేసినా పెద్దగా ఏమీ వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఆమెకు గత ఏడాది వివాహం జరిపించారు. భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్న ఈ భామ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మూడు సినిమాల్లో

మూడు సినిమాల్లో

తెలుగులో ఒక మనసు సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా ఆడకపోవడంతో కాస్త నిరాశ చెందిందనే చెప్పాలి. ఇదే సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేశారు కానీ అక్కడ కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత తెలుగులో హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆ రెండు సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి.

చివరిగా సైరాతో

చివరిగా సైరాతో

ఇక తన పెదనాన్న చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కేవలం రెండే రెండు నిమిషాల పాత్రలో నటించి ఆమె మెప్పించింది. అయితే సినిమాలలో ఆమె పెద్దగా రాణించలేక పోయినా వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెలుగులో ఏకంగా 3 వెబ్ సిరీస్ లను ఈమె నిర్మించింది. అంతేగాక వాటిలో నటించి మెప్పించింది. అలా తెలుగులో ఆమె నుంచి ముద్దపప్పు ఆవకాయి, నాన్న కూచి, మాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ లు వచ్చాయి

గత ఏడాది పెళ్లి

గత ఏడాది పెళ్లి


ఇక ఈ భామ గత ఏడాది వివాహం చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు కాస్త పద్ధతిగానే కనిపించిన ఈ భామ పెళ్లి తర్వాత మాత్రం అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తూ జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా

సోషల్ మీడియాలో యాక్టివ్ గా

తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉంటే ఈ జంట మాత్రం వెకేషన్ కు వెళ్ళింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి వెళ్లి అక్కడ నిహారిక దంపతులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను పంచుకుంటూ ఫాన్స్ తో టచ్ లో ఉండటానికి ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా ఈ భామ ఒక ఫోటో షేర్ చేసి దానికి పెట్టిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Recommended Video

Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
అతడు సినిమాలో లానే

అతడు సినిమాలో లానే

తనను తాను అద్దంలో చూసుకుంటూ పార్ధు ఇంకోసారి చూసి చెప్పు అని కామెంట్ చేసింది. అంతేకాక ఈ కామెంట్ గుర్తు రాని వాళ్ళు అందరూ దయచేసి నాతో మాట్లాడవద్దు అని చెప్పుకొచ్చింది.. విషయం ఏమిటంటే అతడు సినిమాలో త్రిష ఇలాగే తనను తాను అద్దంలో మహేష్ కు చూపిస్తూ నేను అందంగా ఉన్నావో లేదో ఒక సారి అద్దంలో చూసి చెప్పు అని అంటుంది. సరిగ్గా అదే టైంలో బాల్ వచ్చి అద్దానికి తగిలి పగిలిపోయిన సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చూపిస్తారు. ఆ సీన్ గుర్తుచేసుకుంటూ నేను అందంగా లేనా ఇంకోసారి చూసి చెప్పు అంటూ నిహారిక కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X