18 Pages first look: నిఖిల్ కనులపై అనుపమ రాతలు.. అలా రాయడం ఇష్టమట..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో విభిన్నమైన కంటెంట్ కథలకు మంచి క్రేజ్ అందుతోంది. సుకుమార్ లంటి దర్శకులు వారి శిష్యులకు సొంత ప్రొడక్షన్ లో అవకాశాలను కల్పిస్తూ మంచి ఫ్యూచర్ ను అందిస్తున్నారు. ఇక సుకుమార్ కు తొడుగా బడా నిర్మాణ సస్థలు కూడా ఆయనతో చేతులు కలుపుతున్నాయి.
ఇక మొత్తానికి ఇప్పుడు 18 పేజెస్ అనే సినిమాతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాలో నిఖిల్ సిద్ధార్థ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అనుపమ ఫస్ట్ లుక్ లో నిఖీల్ కనులపై ఉన్న కాగితంపై ఎదో రాస్తోంది. ఆ స్పెషల్ లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా పేర్కొంది.

'నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది..' అని వివరణ ఇచ్చింది.
చూస్తుంటే ఈ సినిమాలో ఆర్య లాంటి భావం ఉన్నట్లు అర్ధమవుతోంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో వైవిధ్యమైన సినిమా రాబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. దర్శకుడు సుకుమార్ సినిమాకు స్క్రీన్ ప్లే, కథను అంధించగా కుమారి 21F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక GA2 ప్రొడక్షన్ లో బన్నీ వాసు కూడా ఈ సినిమాకు సహా నిర్మాతగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











