NikkiTamboli:కాలేజీ బయట కుర్రాణ్ణి ప్రేమించా.విషయం తెలిసి అమ్మ నాన్న ఏం చేసారంటే.లవ్ సీక్రెట్స్ బయటపెట్టేసింది

తెలుగులో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నటి నిక్కీ తంబోలి. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాంచన 3 సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో రన్నరప్ గా నిలిచింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నిక్కీ తాజాగా తన కాలేజ్ లవ్ స్టోరీ వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే.

 కీలక విషయాలు

కీలక విషయాలు

బిగ్ బాస్ 14 ఫేమ్ నటి నిక్కి తంబోలి చాలా వేగంగా జనాల్లో క్రేజ్ సంపాదించింది. వాస్తవానికి, ఈ బిగ్ బాస్ 14 రియాలిటీ షోలో నిక్కి చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జనం ఆమెను ఎక్కువగా ఇష్ట పడలేదు, అందుకే ఆమెను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారు. అయితే అది ఎలా ఉన్నా మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాలో నిక్కి తంబోలిని ఫాలో అవుతున్నారు. ఇటీవల, నిక్కీ తంబోలి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.

 బంద్ చేయించారు

బంద్ చేయించారు

కొన్ని నెలల క్రితం, నిక్కి తంబోలి సోదరుడు కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. వెంటనే, ఆమె 'ఖత్రోన్ కే ఖిలాడి' షూటింగ్ కోసం బయలుదేరింది, దీనిపై ఆమె కూడా ట్రోల్ చేయబడింది. కానీ ఇటీవల, ఆమె కాలేజీలో చదివినప్పుడు తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'మొదట్లో కుటుంబ సభ్యులకు దీని గురించి తెలియదు, కానీ మా సంబంధం గురించి తెలిసిన వెంటనే, కళాశాలకు వెళ్లడం బంద్ చేయించారు అని ఆమె చెప్పుకొచ్చింది.

సిద్ధార్థ్ కణ్ణన్‌తో

సిద్ధార్థ్ కణ్ణన్‌తో


ఈ ఇంటర్వ్యూలో, నిక్కీ తన పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది, బాయ్ ఫ్రెండ్ కారణంగా తన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లకుండా ఆపారని ఆమె వెల్లడించింది. ఇక ఇది మాత్రమే కాక తాను ఆ వ్యక్తితో ఆమె సంబంధాన్ని ఇంకా ముగించలేదని నిక్కీ చెప్పింది. నిక్కీ తాంబోలి రేడియో హోస్ట్ సిద్ధార్థ్ కణ్ణన్‌తో సంభాషించారు, ఆ సంభాషణలో ఆమె తన సంబంధం గురించి వివరించింది. నాకు కాలేజీ రోజుల్లో ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, కుటుంబ సభ్యులు దాని గురించి తెలుసుకుని నన్ను కాలేజీకి పంపడం ఆపేశారని పేర్కొంది.

Recommended Video

Thipparaa Meesam Movie Public Talk
ఇప్పటికీ ముగియలేదు

ఇప్పటికీ ముగియలేదు

ఇక కుటుంబానికి ఆమె ప్రియుడు గురించి తెలిసినప్పుడు, మీరు ఎలా స్పందించారు? అని అడగ్గా నిక్కీ మాట్లాడుతూ 'అతను నా కాలేజీకి చెందినవాడు కాదు, అతను కాలేజీలో కూడా లేడని ఆ సమయంలో మా నాన్న నువ్వు చదువుకోవడానికి కాలేజీకి వెళ్తావు, కానీ నువ్వు బయట అబ్బాయిలతో ఎలా స్నేహం చేశావు? అని ప్రశ్నించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో, నిక్కి తంబోలి తమ సంబంధం ఇంకా ముగియలేదని వెల్లడించింది. ఇక బిగ్ బాస్ 15 కి ముందు 'వీకెండ్ కా వార్'లో నిక్కి తాంబోలి తన పాత స్టైల్‌లో కనిపించింది. ఈ సీజన్‌లో ఆమె ప్రతీక్ సహజ్‌పాల్‌కు మద్దతు ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X