twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులపై నిత్యా మీనన్ ‘సైలెంట్ ఫైటింగ్’

    |

    పాపులర్ సౌత్ హీరోయిన్ నిత్యా మీనన్ తాను సెక్సువల్ హరాస్మెంట్‌కు పూర్తిగా వ్యతిరేకమని, దీనిని ఎదుర్కొనేందుకు తాను విభిన్నమైన దారిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తాను అందరితో కలిసి గ్రూపుగా పోరాడటం లేదని, సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నట్లు తెలిపారు.

    ఆ మధ్య మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ నటిని కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడటం ఇండస్ట్రీలో సంచలనం అయింది. దీని వెనక నటుడు దిలీప్ ఉన్నాడనే ఆరోపణలు సైతం వచ్చాయి. ఈ సంఘటనకు వ్యతిరేకంగా మలయాళం ఇండస్ట్రీలో ఆందోళనలు జరిగాయి. నటీమణులంతా 'ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' గా ఏర్పడ్డారు. అయితే ముందు నుంచి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు నిత్యా మీనన్.

    వారి పోరాటానికి వ్యతిరేకం కాదు

    వారి పోరాటానికి వ్యతిరేకం కాదు

    గత ఇంటర్వ్యూల్లో నిత్యా మీనన్ తానెప్పుడూ లైంగిక వేధింపులు లాంటి సమస్య ఎదుర్కోలేదని చెబుతూ వచ్చారు. అయితే మీ తోటి నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు, సంఘటితమై పోరాటం చేస్తున్నారు. మీకు వారితో కలిసి పోరాటం చేయాలని అనిపించడం లేదా? అనే ప్రశ్న నిత్య మీనన్ స్పందిస్తూ... ‘వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. అయితే అందులో నేను పాల్గొనలేదని వారు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకం అని భావించవద్దు. నా స్టైల్‌లో నేను లైంగిక వేధింపుల సమస్యను అరికట్టే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

     ముందే జాగ్రత్తపడతాను

    ముందే జాగ్రత్తపడతాను

    తనదైన పద్దతిలో పని చేయడం ద్వారా అలాంటి పరిస్థితులకు మనం చోటు ఇవ్వకుండా చేయడం నా స్టైల్. మన వర్కింగ్ స్టైల్‌లోనే ఎదుటివారికి మన గురించి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. ఎవరూ తనను తప్పుడు ఉద్దేశ్యంతో అప్రోచ్ అయ్యే అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడతాను...అని నిత్యా మీనన్ తెలిపారు.

    సైలెంటుగా చేసుకుంటూ వెళతా

    సైలెంటుగా చేసుకుంటూ వెళతా

    ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోవడంలో నేను ఒక విభిన్నమైన మార్గాన్ని అనుసరిస్తాను. అయితే నేను చేసే పనులన్నీ చాలా సైలెంటుగా ఉంటాయి. తప్పుడు ఉద్దేశ్యం కనిపిస్తే వెంటనే సినిమా చేయడానికి నో చెబుతాను. సెక్సువల్ మిస్‌కండక్ట్స్ ఎదురైనపుడు ఆయా ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని నిత్యా మీనన్ తెలిపారు. అయితే ఆ సినిమాల పేర్లు మాత్రం ఆమె వెల్లడించలేదు.

    ‘మిషన్ మంగళ్' గురించి

    ‘మిషన్ మంగళ్' గురించి

    తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మిషన్ మంగళ్' గురించి వివరిస్తూ... ఇందులో తాను శాస్త్రవేత్తగా కనిపించబోతున్నట్లు తెలిపారు. గతంలో బాలీవుడ్ అవకాశాలు వచ్చినా ఇతర సినిమాల్లో బిజీగా ఉండటం, మంచి పాత్రలు లేక పోవడం వల్ల వదులుకోవాల్సి వచ్చింది. అయితే ‘మిషన్‌ మంగళ్‌' మూవీలో తాను కోరుకున్న విధంగా ముఖ్యమైన పాత్ర లభించిందని తెలిపారు.

    Recommended Video

    Nithya Menen To Play J Jayalalithaa In A Biopic Titled As The Iron Lady
    అక్షయ్ కుమార్ చెప్పారు

    అక్షయ్ కుమార్ చెప్పారు

    ‘మిషన్‌ మంగళ్‌' సినిమాలో నేను శాస్త్రవేత్తగా నటిస్తే బాగుంటుంది దర్శకుడు జగన్‌ శక్తి ఫోన్‌ చేసి చెప్పారు. ఈ పాత్రలో నన్ను ఎంపికచేసుకోవాలని అక్షయ్‌కుమార్ సూచించారని ఆయన తెలిపారు. నేను సినిమా ఎంపిక చేసే విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తాను. కేవలం నాది లీడ్ రోల్ కావాలని ఎప్పుడూ ఆలోచించను. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా? నా పాత్రను వారు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుందా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తాను అని నిత్యా మీనన్ వెల్లడించారు. నిత్యా మీనన్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Popular south Indian actress Nithya Menen says she is against sexual harassment and that she has a different way of countering it. She chose not be a part of a grouping as she prefers to fight it “silently”. Last February, an actress had been kidnapped and assaulted in Kochi. Then it emerged that the abduction was allegedly masterminded by Malayalam superstar Dileep.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X