మహేష్ బాబు కోసం పవన్ కళ్యాణ్ హీరోయిన్.. మరో లక్కీ ఛాన్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే గ్లామర్ ను పెద్దగా టచ్ చేసి చేయనట్లుగా ఉండేవారు కూడా ఉన్నారు. అలాంటి బ్యూటీలలో నివేదా థామస్ ఒకరు. ఈ బ్యూటీ చాలా వరకు గ్లామర్ డోస్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంది. ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. నివేదా థామస్ ఇటీవల పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మెయిన్ రోల్ కాకపోయినప్పటికి తన టైమింగ్ లోనే టాలెంట్ ను నిరూపించుకుంది. ఆ పాత్ర అనంతరం అమ్మడికి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ బాగానే వచ్చాయి. కానీ నివేదా ఏ మాత్రం పెద్దగా టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు బెస్ట్ అనిపించిన పాత్రలనే సెలెక్ట్ చేసుకుంది.

ఇక చాలా కాలం అనంతరం నివేదా మరొక మంచి ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే తప్పకుండా చాలా ఇంపార్టెంట్ రోల్ అయ్యుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ దర్శకుడి సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు చాలా మంచి స్కోప్ ఉంటుంది. అందుకే నివేదా థామస్ కూడా కథ వినగానే ఒప్పేసుకుందట. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











