ఇండస్ట్రీలోకి మరో కొత్త నేషనల్ క్రష్.. రష్మికకు చెక్ పెట్టిన బ్యూటీ ఎవరు?
National Crush: ఇంతకాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో 'నేషనల్ క్రష్'అంటే మనకు గుర్తొచ్చేది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). 2020లో గూగుల్ ద్వారా అధికారికంగా ఆమెకు "నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా" బిరుదు లభించగా, ఆ తరువాత ఆనిమల్ సినిమా ద్వారా త్రిప్తీ దిమ్రి (Tripti Dimri) కూడా అదే స్థాయి గుర్తింపును పొందింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త నేషనల్ క్రష్ దొరికిందనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ కొత్త హీరోయిన్ ఎవరు? రష్మిక స్థానాన్ని ఆక్రమించబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఓ లూక్కేయండి.
'నేషనల్ క్రష్'అని పిలవబడే హీరోయిన్ ఇప్పుడు మారిందా? ఈ టైటిల్ ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకే సొంతం. 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్', 'పుష్ప', 'పుష్ప 2', 'అనిమల్'వంటి హిట్లతో దేశవ్యాప్తంగా రష్మిక ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు నెటిజన్లు కొత్త పేరును ట్రెండ్ చేస్తున్నారు ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ( Rukmini Vasanth).

కన్నడ భామా రుక్మిణీ వసంత్ 'బీర్బల్ త్రయం'సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 'అప్పుడో ఇప్పుడు ఎప్పుడో'ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా, ఆమె ప్రత్యేకమైన హర్రర్, ప్రెజెన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'సప్తసాగరా లు దాటి'మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తాజా 'కాంతార: చాప్టర్ 1'(Kantara: Chapter 1)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో 'కనకవతి'పాత్రలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
కాంతార: చాప్టర్ 1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రుక్మిణీ ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, నటన, గాంభీర్యం, ఎమోషనల్ ప్రెజెంటేషన్‌తో ఆమె ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్టులతో కాస్త కూడా రిపీటేషన్లు లేకుండా రుక్మిణీ తన రోల్‌ను చక్కగా పర్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడిని సోషల్ మీడియాలో అభిమానులు "నేషనల్ క్రష్" అని పిలుస్తున్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ తెలుగు సినిమా 'డ్రాగన్'లో హీరోయిన్‌గా నటిస్తోంది.
రుక్మిణీ ఈ ప్రశంసలపై వినమ్రంగా స్పందించారు. "నన్ను చాలామంది నేషనల్ క్రష్ అంటుతున్నారు. అది బాగుంది. కానీ నేను దాని గురించి ఆలోచించను. అలాంటి పొగడ్తలు తాత్కాలికం, కాలంతో మారిపోతాయి," అని చెప్పారు. మొత్తానికి.. రష్మిక మందన్న తర్వాత 'నేషనల్ క్రష్' బిరుదును ఇప్పుడు రుక్మిణీ వసంత్ సొంతం చేసుకుంటోంది. కాంతార చాప్టర్ 1, డ్రాగన్, టాక్సిక్ వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్టులతో రుక్మిణీ పేరు త్వరలోనే దేశవ్యాప్తంగా మారుమోగే అవకాశముంది. సౌత్, నార్త్ ఇండియాలో తన ఫ్యాన్ బేస్ పెరుగుతున్న క్రమంలో, రుక్మిణీ భవిష్యత్తులో మరో పెద్ద స్టార్‌గా ఎదగనున్నదని ఫ్యాన్ భావిస్తున్నారు. మరోవైపు రష్మిక పరిస్థితి ఏంటీ? అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు.


Click it and Unblock the Notifications











