Parineeti Chopra: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పరిణితీ చోప్రా.. తండ్రైన ఎంపీ రాఘవ్ చద్దా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు తల్లిదండ్రులయ్యారు. పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీనిపై వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో వీరిద్దరికి సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

Parineeti Chopra and Raghav Chadha blessed with baby boy

2011లో బాలీవుడ్ ఎంట్రీ
ప్రియాంక చోప్రా అడుగుజాడల్లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు పరిణీతి చోప్రా. 2011లో లేడీ వర్సెస్ రిక్కీ బల్ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇష్క్‌జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్, హాసీ తో ఫాసీ కిల్ దిల్, గోల్‌మాల్ ఎగైన్, కేసరి, సందీప్ ఔర్ పింకీ ఫారర్, అమర్ సింగ్ చంకిలా, ఉంచాయ్ తదితర సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పరిణీతి. నటిగానే కాకుండా సింగర్‌‌గాను సత్తా చాటింది పరిణీతి. 2013లో ఫోర్బ్స్ ఇండియాస్ సెలబ్రిటీ 100 లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

రాఘవ్ చద్దాతో డేటింగ్
కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పరిణీతి చోప్రా... ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనికి ఇద్దరూ రెస్పాండ్ కాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయినప్పటికీ గుర్గావ్‌లోని ఓ హోటల్‌లో పరిణీతి, రాఘవ్‌లు డేట్‌కు వెళ్లడం, దీనికి సంబధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఇద్దరి మధ్య రిలేషన్‌ను కన్ఫర్మ్ అయ్యింది. తమ బంధాన్ని నిజం చేస్తూ... తాము త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా పరిణీతి- రాఘవ్‌లు అధికారికంగా ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, నాటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు.

భర్త, కుటుంబంతోనే
పెళ్లయ్యాక భర్తతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ, వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు రాఘవ్ చద్దా. ఈ క్రమంలో సినిమాలను పూర్తిగా తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. కుటుంబంతోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్ట్‌లో తాను గర్భం దాల్చినట్లు అభిమానులకు శుభవార్త చెప్పింది. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు విషెస్ తెలియజేశారు. దీంతో తన స్నేహితురాలు, బాలీవుడ్ నటి అలియా భట్.. ఆమెకు స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన పరిణీతి చోప్రా పలు వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే భర్త రాఘవ్ చద్దాతో కలిసి కార్వా చౌత్ వేడుకల్ని ఆమె ఘనంగా జరుపుకున్నారు.

మా సర్వస్వం వాడే
డెలివరీ డేట్ దగ్గరపడటంతో పరిణీతి చోప్రా ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 19వ తేదీన పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పరిణీతి, రాఘవ్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి.. ఇప్పటి వరకు ఒకరిగా ఒకరుగా ఉన్న మాకు, ఇప్పుడు సర్వస్వం మా బాబే అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X