For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pooja Hegde: చెప్పలేని చోట బుట్టబొమ్మకు సర్జరీ.. అసలు విషయం ఏమిటంటే?

  |

  స్టార్ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. ఒక లైలా కోసం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే అనతి కాలంలోనే తెలుగు చిత్రసీమ బుట్టబొమ్మగా మారిపోయింది. సినిమాల్లో ఆచి తూచి అడుగులు వేస్తూ బికినీలు ధరించి మరి గ్లామర్ షో చేసింది. ఇక రంగస్థలం మూవీలో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి యమ క్రేజ్ సంపాందించుకుంది. ఇటీవల రాధేశ్యామ, బీస్ట్ వంటి చిత్రాలు పరాజయాలపాలైన మూవీ ఆఫర్లు మాత్రం తగ్గట్లేదు ఈ అమ్మడికి. అయితే ఈ మధ్య పూజా హెగ్డే తన అందం మెరుగు పరుచుకునేందుకు ఆ బార్డీ పార్టుకు సర్జరీ చేసుకుందని వార్తలు వినిపించాయి.

  మైమరపించే అందం ఈ బుట్టబొమ్మ సొంతం..

  మైమరపించే అందం ఈ బుట్టబొమ్మ సొంతం..

  ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. మైమరపించే అందం, అబ్బురపరిచే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది.

  పరాజయాలతో సతమతం..

  పరాజయాలతో సతమతం..

  అయితే, ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న పూజా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమాతో మహేశ్ బాబుతో కలిసి పూజా నటించడం రెండోసారి అవుతుంది. గతంలో మహర్షి సినిమాలో మహేశ్ బాబుతో పూజా హెగ్డే ఆడిపాడిన విషయం తెలిసిందే.

  ఒక్కసారిగా గ్లామర్ డోస్..

  ఒక్కసారిగా గ్లామర్ డోస్..

  ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాల్లో పద్దతిగా కనిపించిన ఈ బుట్టబొమ్మ ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక అల్లు అర్జున్ సరసన నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే) మూవీలో ఏకంగా బికినీ వేసి మరి హాట్ షో చేసింది. తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా అలరించింది. ఇక సినీ ప్రపంచం అంటేనే గ్లామర్. అందుకు తగినట్లుగానే హీరోయిన్లు ఉండాలని అనుకుంటారు. ఇందుకోసం ఎంతోమంది హీరోయిన్లు వాళ్ల బాడీ పార్టులకు సర్జరీలు చేసుకున్న విషయం తెలిసిందే.

  అక్కడ సర్జరీ..

  అక్కడ సర్జరీ..

  తన అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు పూజా హెగ్డే తన ముక్కుకు సర్జరీ చేయించుకుందని ఇటీవల వార్తలు వినిపించాయి. ముక్కుతోపాటు పెదాలకు కూడా సర్జరీ జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్లలో ఇదే కామనే కదా అని అందరూ నిజం అని నమ్మారు. అయితే తాజాగా ఈ వార్తలపై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. ఆగస్టు నెలలో కేవలం వెకేషన్ కు వెళ్లి వచ్చిందని, పూజాకు ఎలాంటి సర్జరీ జరగలేదని, అవన్నీ వట్టి రూమర్సే అని స్పష్టం చేసింది.

  సమంత కూడా ఇలానే..

  సమంత కూడా ఇలానే..

  దీంతో పూజా హెగ్డే తన బాడీ పార్టుకు సర్జరీ చేసుకోలేదని క్లారిటీ వచ్చినట్లయింది. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇలానే స్కిన్ సమస్యతో సర్జరీ చేయించుకుందని వార్తలు రాగా అదంతా అబద్ధమని సామ్ టీమ్ కూడా స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. కాగా చిన్న వయసులోనే పూజా హెగ్డే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో సినీ రంగానికి పరిచయం అయింది. జీవా హీరోగా చేసిన ఈ మూవీని తెలుగులో మాస్క్ పేరుతో విడుదల చేశారు.

  హిట్ కొట్టని బాలీవుడ్ మూవీ..

  హిట్ కొట్టని బాలీవుడ్ మూవీ..

  ఆ తర్వాత అనంతరం నాగ చైతన్య నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'లో హీరోయిన్ గా మెరిసింది. కానీ, ఇవన్నీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా అది కూడా హిట్ కాలేదు. తెలుగులో హిట్లు రాకున్నా పూజా హెగ్డేకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు. ఇక, ఈ బ్యూటీకి 'అరవింద సమేత.. వీరరాఘవ'తో భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది. తద్వారా టాలీవుడ్‌లో హవాను చూపించింది.

  English summary
  Tollywood Buttabomma Pooja Hegde Team Denies And Gives Clarity On Her Cosmetic Surgery Rumors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X