Poonam Kaur: బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తిన పూనమ్.. ఆమె గురి ఎవరిపై?
Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాజిటివ్ విషయాలకంటే వివాదాస్పద ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంది ఈ అమ్మడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేసి వార్తల్లో నిలిచింది. అయితే.. ఆ ట్వీట్ పాజిటివ్ గానే ఉన్నా.. సోషల్ మీడియాలో వైరల్ మారింది. మరో స్టార్ హీరోను టార్గెట్ చేస్తూ.. కామెంట్స్ చేశారని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటీ? ఆ కథేంటీ?
పంజాబీ భామ పూనమ్ కౌర్ మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి, ఆ ఫేమ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'మాయాజాలం' సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, 'గగనం', 'శ్రీనివాస కళ్యాణం' వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాలలో కూడా అవకాశం పొందింది.

ఈ సినిమా ద్వారా తన ఫిజికల్ అప్‌యిరెన్స్, గ్లామర్ షో, నటనకు ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చింది. తొలిసినిమాతోనే టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించే అవకాశాలు సంపాదించుకుంది. కానీ, తర్వాత కొంతకాలంలో ప్రధాన హీరోయిన్ పాత్రలు రాకుండా, తక్కువ సినిమాల్లో మాత్రమే నటించింది. తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమని కాదు, పూనమ్ కౌర్ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. తక్కువ సినిమాలేనప్పటికీ, తన గ్లామర్, ఫ్యాషన్, సోషల్ మీడియా యాక్టివిటీ ద్వారా కుర్రకారుల మనసుల్లో నిలిచింది.
తాజాగా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది. ఇటీవల ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ ట్వీట్‌లో ఆమె నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ని పొగిడగా, 'చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని' పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు మరీ త్వరగా వైరల్ అయ్యాయి. బాలయ్యని సన్మానిస్తూ, 'పెద్ద వృక్షంలా, అన్ని సీజన్లలో మనుషులు, జంతువులకు నీడనిస్తూ ఉంటారు. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారు' అని పూనమ్ పేర్కొంది. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గట్టిగా నిరసిస్తున్నారు.
'బాలయ్య గతంలో మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరిచిపోకూడదు, అలాంటి వ్యక్తిని పొగడటం సరికాదు'అని వారు అభిప్రాయపడ్డారు. కొందరు ఫ్యాన్స్ పూనమ్‌పై 'సినీ ఇండస్ట్రీలో ఎదగలేక, ఇలా వివాదం ద్వారా ఫేమస్ కావాలని ప్రయత్నిస్తున్నావా' అంటూ విమర్శలు చేస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధానికి దారితీసింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య టెన్షన్ ఇంకా పెరుగుతోంది.
అసలు పునమ్ కౌర్ నిజంగా బాలయ్యను పొగిడిందా? మెగా ఫ్యాన్స్ అభిప్రాయాలను బట్టి అది వివాదానికి దారితీసింది. ఆమె గతంలో త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ వంటి వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలు కూడా తరచుగా వార్తల్లోకి వచ్చాయి. ఇప్పుడు అదే విధంగా, బాలయ్యపై చేసిన సానుకూల వ్యాఖ్యలు మరింత చర్చనీయంగా మారింది. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ల వల్ల అభిమానుల మధ్య వాస్తవానికి ఫ్యాన్ వార్ స్టార్ అవుతుందట మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. పునమ్ కౌర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ ట్విట్ చేసిందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో కొత్త రచ్చ షూరు అయ్యింది.


Click it and Unblock the Notifications











