భర్తతో విడాకులంటూ ప్రచారం.. రెండోసారి తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్
ఇటీవలి కాలంలో టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ వరుసపెట్టి గుడ్ న్యూస్ చెబుతున్నారు. రెండ్రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దాలు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్‌లో మరికొందరు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రెండోసారి గర్భం దాల్చినట్లు గుడ్‌న్యూస్ చెప్పి అభిమానులకు పండుగ తీసుకొచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
పోస్ట్‌తో షాకిచ్చిన పూర్ణ భర్త
సీమటపాకాయ్, అవును చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా షమ్నా ఖాసిం అలియాస్ పూర్ణ. కేరళ అమ్మాయే అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్‌గా తన హవా తగ్గడంతో ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి బిజీ అయ్యారు. వెండితెర మీదే కాకుండా బుల్లితెరపైనా జడ్జిగా వ్యవహరిస్తూ అక్కడా సక్సెస్ కొట్టారు. కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌ల చుట్టూ తిరుగుతూ కష్టపడుతున్నారు పూర్ణ. కొద్దిరోజుల క్రితం నటి పూర్ణను ఉద్దేశించి ఆమె భర్త డాక్టర్ షనీద్ అసిఫ్ అలీ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.

భర్తకు దూరంగా పూర్ణ
దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని 2022లో ఘనంగా వివాహం చేసుకున్నారు పూర్ణ. కొద్దిరోజులకు పూర్ణ గర్భం దాల్చగా 2023 ఏప్రిల్ 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త, కొడుకే ప్రపంచంగా జీవిస్తూ.. వారితో గడుపుతున్నారు పూర్ణ. అయితే సినిమాలు, షూటింగ్స్, ఇతరత్రా పనుల కారణంగా తాను తన భార్య దూరంగా ఉండాల్సి వస్తోందని పూర్ణ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. 45 రోజులుగా నరకం అనుభవిస్తున్నానని.. ఈ ఒంటరితనాన్ని భరించడం తన వల్ల కావడం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. రాత్రుళ్లు పూర్ణ జ్ఙాపకాలతో గడిపేస్తున్నానని, రోజూ ఉదయం తనని తల్చుకుని ఏడ్చేవాడినని అసిఫ్ వాపోయారు.
పూర్ణ విడాకులపై గాసిప్స్
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పూర్ణ తన భర్తకు దూరంగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్స్ మొదలయ్యాయి. అసలే భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు బాంబు పేలుస్తారో తెలియక పోవడంతో పూర్ణ కూడా భర్తకు విడాకులు ఇవ్వబోతుందా అన్న గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటిని పూర్ణ, అసిఫ్ అలీ ఖండించారు. ఈ నేపథ్యంలో పూర్ణ ఓ హాట్ న్యూస్ చెప్పి షాకిచ్చారు.
రెండోసారి గర్భం దాల్చిన పూర్ణ
తాను రెండోసారి గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ వార్తతో మా మనస్సులు సంతోషంతో నిండిపోయాయని తెలిపింది. మా కుటుంబంలోకి మరొకరు రానున్నారని రెండో ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసింది. మనం ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుని జీవించడం అనే కల తన జీవితంలో నిజమైందని పేర్కొంది పూర్ణ. తల్లిదండ్రులం కావడం అనేది అందమైన అధ్యాయమని వెల్లడించింది. ఈ ప్రకటనతో తాను, తన భర్త ఎంత అన్యోన్యంగా ఉన్నామో తెలియజేయడంతో పాటు విడాకుల వార్తలకు చెక్ పెట్టింది పూర్ణ. రెండోసారి గర్భం దాల్చిన పూర్ణకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











