Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sidharth Shukla మరణం వెనుక ఎన్నో అనుమానాలు? పెదవి విప్పని కూపర్ హాస్పిటల్.. ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ అలా..
నటుడు, బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు శుక్రవారం ముంబైలోని ఓషివారా శ్మశాన వాటికలో ముగిసాయి. కూపర్ హాస్పిటల్‌లో పోస్ట్ మార్టమ్ అనంతరం అలంకరించిన అంబెలెన్స్ వెంట ప్రియురాలు షెహనాజ్ గిల్, ఆమె తల్లి, ఇద్దరు చెల్లెల్లు పుట్టెడు విషాదంతో శ్మశానవాటికకు చేరుకొన్నారు. ఇలాంటి విషాద పరిస్థితుల్లో ప్రియాంక చోప్రా, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. ఇక సిద్దార్త్ మరణం స్టాండప్ కమెడియన్ చేసి ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్‌పై అనుష్క శర్మ భావోద్వేగంగా స్పందించారు. అలాంటి వివరాల్లోకి వెళితే..

మరణానికి ముందు సిద్దార్థ్ శుక్లా
సిద్ధార్థ్ శుక్లా తన మరణానికి ముందు వరకు చాలా యాక్టివ్‌గా కనిపించారు. బిగ్‌బాస్ ఓటీటీ షోలో చురకుగా పాల్గొన్నారు. అలాగే డ్యాన్స్ దీవానా రియాలిటీ షోలో చివరిసారిగా కనిపించారు. అయితే సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించిన ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అందర్నీ షాక్ గురిచేసింది. అయితే ఆయన పోస్టు మార్టం నిర్వహించిన కూపర్ హాస్పిటల్ వర్గాలు మరణంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సిద్ధార్థ్ మరణం వెనుకు ప్రాథమిక రిపోర్టును వెల్లడించకపోవడం అనేక సందేహాలకు దారి తీస్తున్నది.

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సంతాపం
సిద్దార్థ్ శుక్లా ఆకస్మిక మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్, వరుణ్ ధావన్ లాంటి సినీ ప్రముఖులు సంతాపం, విచారం వ్యక్తం చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా సంతాపం వ్యక్తం చేస్తూ చాలా చిన్న వయసులో సిద్దార్థ్ శుక్లా తమను విడిచి వెళ్లారనే బాధను ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు.
Recommended Video

ప్రియాంక చోప్రా ఎమోషనల్‌గా
ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని పోస్టు చేస్తూ ప్రముఖ రచయిత పీటర్ స్ట్రోపల్ కొటేషన్‌ను పేర్కొన్నారు. లెగసీ అనేది ప్రజలకు ఏదో వదిలి వెళ్లదు. అది ప్రజల హృదయాల్లో నాటుకొని పోతుంది అని పేర్కొన్నారు. సిద్ధార్థ్ మరణం చాలా బాధాకరం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులు, ఫ్యాన్స్‌కు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

సిద్దార్థ్ మరణం ఓ తమాషాగా
ఇక సిద్ధార్థ్ శుక్లా మరణం బాలీవుడ్ ప్రముఖులకు ఓ తమాషాగా మారిందని స్టాండప్ కమెడియన్ జకీర్ ఖాన్ చేసిన ఇన్స్‌టాగ్రామ్ పోస్టుపై బాలీవుడ్ అగ్ర నటి అనుష్క శర్మ ఘాటుగా స్పందింంచారు. కమెడియన్ జకీర్ ఖాన్ ఇన్స్‌టాగ్రామ్‌లో మనసు భారంగా ఉంది. వాళ్లు నిన్ను మనిషిగా చూడటం లేదు. ఎందుకంటే వాళ్లకు భావోద్వేగాలు, బంధాలపట్ల నమ్మకం లేదు. అందుకే నీకు సంతాపం సందేశం కూడా చెప్పలేకపోతున్నారు. కానీ విగతజీవిగా మారిన నీ శవపేటిక వాళ్లకు ఓ ఫోటో తీసుకోనే అవకాశాన్ని కల్పించింది అని జకీర్ ఖాన్ తన పోస్టులో తన ఎమోషన్స్‌ను బయటపెట్టాడు.
అనుష్క శర్మ భావోద్వేగంతో
స్టాండప్ కమెడియన్ పోస్టును అనుష్క శర్మ షేర్ చేసింది. ఆ తర్వాత తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయింది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పుట్టెడు దు:ఖంలో ఉన్న నీ కుటంబానికి, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని సంతాప సందేశంలో అనుష్క శర్మ పేర్కొన్నారు.