అవార్డ్స్ ఫంక్షన్ లో ఉల్లి పొర లాంటి డ్రెస్.. భర్తతో కలిసి రచ్చ రేపిన ప్రియాంకచోప్రా!
గ్లోబల్ సార్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ ను ఒకప్పుడు ఏలిన ఈ భామ ఇప్పుడు హాలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై ఈ భామ ఇప్పుడు రచ్చ చేస్తోంది. ఇక ఎప్పటికప్పుడు తనదైన శైలిలో అందాల ఆరబోతతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా బిల్‌బోర్డు మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఆమె ఎద అందాల ఆరబోత షో ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే
గ్లోబల్ స్టార్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక హాలీవుడ్‌ను సైతం మెప్పించి గ్లోబల్ స్టార్‌గా కీర్తి సంపాదించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ లవ్ సీక్రెట్స్ ను చాలానే వెల్లడించింది ఈ భామ. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాము డేటింగ్ చేస్తున్నప్పటి రహస్యం కూడా బయటపెట్టేసింది. అప్పుడప్పుడే హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో నిక్ తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది.
పదేళ్ళ చిన్నవాడితో ప్రేమ
అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్ ఆమె కంటే వయసులో పదేళ్లు చిన్నవాడు, అయినా అతనితో రహస్యంగా డేటింగ్ చేసింది. అలా కొంతకాలం ఎంజాయ్ చేశాక ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తున్న ఈ భామ ఈమధ్యన 'ది వైట్ టైగర్' సినిమాతో సక్సెస్ అందుకుంది.
ఉల్లి పొర లాంటి డ్రెస్ లో
లాస్ ఏంజెల్స్‌లో బిల్‌బోర్డు మ్యూజిక్ అవార్డ్స్ ఆదివారం నాడు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలను నిక్ జోనాస్ హోస్ట్ గా వ్యవహరించగా ప్రియాంక బంగారు వర్ణపు డ్రెస్ ధరించి కనువిందు చేసింది. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన డ్రెస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ఉల్లి పొర లాంటి డ్రెస్ లో ఆమె అందాలతో అందరినీ ఆకట్టుకుంది.
Recommended Video
చాలా ఎగ్జయిటింగ్ గా
డోల్సే అండ్ గబ్బన డిజైన్ చేసిన స్పార్‌క్లింగ్ గోల్డెన్ గౌనులో బల్గరీ అలంకరణతో నిక్ పక్కన నిల్చొని తళుక్కున మెరిసింది ప్రియాంక. ఇక నిక్ కూడా గ్రీన్ సూట్ ధరించాడు. ఇక ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు మైక్రోసాఫ్ట్ థియేటర్ లో రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బిల్ బోర్డు మ్యూజిక్ అవార్డ్స్‌ను సమర్పించడం చాలా ఎగ్జయిటింగ్ గా ఉందని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది ఈ భామ.


Click it and Unblock the Notifications











