OG మూవీకి ప్రియాంక మోహన్ రెమ్యునరేషన్.. మరీ ఇంతనా.. కారణం?
యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించిన భారీ చిత్రం, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ They Call Him OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో OG చిత్రం రూపుదిద్దుకుంది. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే తొలిసారిగా టాలీవుడ్ లో ప్రియాంక మోహన్ అగ్ర హీరో సరసన నటించడం విశేషం. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రియాంక మోహన్ కు మంచి రోజులు మొదలయ్యాయని సినీ ప్రముఖులు అంటున్నారు.
కన్నడకు చెందిన ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ప్రియాంక అరుళ్ మోహన్ తను నటించిన చిత్రాల్లో గ్లామర్ ఎక్స్ పోజ్ కు నో చెబుతూ, వెండితెరపై పద్ధతిగా మెరుస్తూ వస్తుంది. క్లీన్ బ్యాక్ గ్రౌండ్ ను మెయిన్ టెయిన్ చేస్తూ ఉండటం విశేషం. మరోవైపు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా పద్ధతిగా, ఒంటి నిండుగా దుస్తులు ధరించి, చూస్తే తెలుగు ఇంటి అమ్మాయిలాగానే కనిపిస్తూ వస్తుంటుంది.

వీటన్నింటి కారణంగా ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకుల్లో, సౌత్ ఆడియెన్స్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్వాలిటీనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని సంపాదించి పెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నతమైన పదవీలో ఉన్నారు. దీంతో ఆయన నుంచి వచ్చే సినిమా ప్రజామోదంగా ఉండాలని, అలాగే హీరోయిన్ కూడా తెలుగింటి ఆడపడుచులా ఉండాలని ప్రియాంక మోహన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
అయితే, ప్రియాంక మోహన్ కు OG చిత్రంలో మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటించినందుకు పారితోషికం కేవలం రూ.40 లక్షలు మాత్రమే ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. గతంలో సూర్య, శివ కార్తీకేయ, నేచురల్ స్టార్ నాని సరసన నటించినా ఆమె రెమ్యునరేషన్ లో ఎలాంటి మార్పులు లేవని అంటున్నారు. అందుకు కారణం ఏంటనేది తెలియదు. ఆమె గత చిత్రం నాని సరసన నటించిన సరిపోదా శనివారం మూవీకి రూ.1.50 కోట్లు తీసుకుంది.
ఇక ఓజీ చిత్రానికి మాత్రం ప్రియాంక మోహన్ కొంచెం తక్కువగా 1.25 పారితోషికాన్ని అందుకున్నారని సినీ వర్గాల్లో టాక్. దీంతో ప్రియాంక మోహన్ నిడివి సినిమాలో ఎంత ఉంటుందనేది సందేహంగా మారింది. ఇక ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేశారు. తాాజాగా ట్రైలర్ కూడా విడుదలై ప్రేక్షకులకు ఇంకా అంచనాలను పెంచేస్తోంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











