For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Punarnavi Bhupalam: న్యూ ఇయర్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి.. ఆ వ్యాధితో బాధపడుతున్న బ్యూటి, పోస్ట్ వైరల్!

  |

  కొత్త ఏడాది ఎలాంటి విషాదాలు చూడకూడదని, బ్యాడ్ న్యూస్ లు వినకూడదని సంతోషంగా 2023ని ఆహ్వానించింది టాలీవుడ్. అయితే తొలివారంలోనే ప్రముఖ గేయ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి మరణంతో కొత్త సంవత్సరం ఆరంభమైంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన బిగ్ బాస్ బ్యూటి పునర్నవి భూపాలం అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ ద్వారా సూపర్ పాపులర్ అయిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం. ప్రస్తుతం స్టడీస్ కోసం విదేశాల్లో ఉంటున్న పునర్నవి తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి తెలిపింది.

  హీరోయిన్ కంటే ఎక్కువగా..

  హీరోయిన్ కంటే ఎక్కువగా..

  తెలుగు అమ్మాయి పునర్నవి భూపాలం రాజ్ తరుణ్-అవికా గోర్ నటించిన 'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన పునర్నవి భూపాలం ప్రేక్షకులను బాగా మెప్పించింది. అప్పుడు హీరోయిన్ కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆమె స్మైల్ బాగుందని సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో అక్కినేని నాగార్జున కూడా మెచ్చుకున్నారు.

  దక్కని గుర్తింపు..

  దక్కని గుర్తింపు..

  ఉయ్యాల జంపాల సినిమా తర్వాత పునర్నవి భూపాలం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా అనేక చిత్రాల్లో నటించింది. కానీ అనుకున్నంత గుర్తింపును తెచ్చుకోలేక పోయింది బ్యూటిఫుల్ పునర్నవి భూపాలం. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు, హీరోయిన్‌గా నటించినా పునర్నవికి కావాల్సిన గుర్తింపు దక్కలేని పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.

  ఫైర్ బ్రాండ్ గా పునర్నవి..

  ఫైర్ బ్రాండ్ గా పునర్నవి..

  టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున మొదటిసారిగా హోస్ట్ బాధ్యతలు అందుకున్న బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అందాల భామ పునర్నవి భూపాలం. హౌజ్ లోకి వెళ్లిన కొత్తలోనే అందరి దృష్టిని ఆకర్షించిది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తన వ్యవహార శైలీతో తరచుగా వార్తల్లో నిలిచింది ఈ హాట్ బ్యూటి. అలాగే బిగ్ బాస్ హౌజ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది పునర్నవి భూపాలం. దీంతో సూపర్ గా ఫేమస్ అయింది.

   పెళ్లి చేసుకోబోతున్నట్లుగా..

  పెళ్లి చేసుకోబోతున్నట్లుగా..

  ఇక బిగ్ బాస్ హౌజ్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి భూపాలం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరు ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు వచ్చేలా చేశారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వాళ్లు పండించిన రొమాన్స్.. రాహుల్-పునర్నవి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అనేలా చేసింది. ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని.. తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

  77 రోజుల తర్వాత బయటకు..

  77 రోజుల తర్వాత బయటకు..

  బిగ్ బాస్ లో 77 రోజుల తర్వాత పునర్నవి భూపాలం బయటకు వచ్చేసింది. తర్వాత రాహుల్-పునర్నవి కలిసి పెద్దగా ఎక్కడా కనిపించలేదు. తర్వాత ఎవరి కెరీర్ తో వాళ్లు బిజీ అయిపోయారు. అనంతరం పునర్నవి భూపాలానికి పలు ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం తదితర చిత్రాలతోపాటు కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఈ బ్యూటి.

  ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో..

  సినిమాలు, వెబ్ సిరీస్ ల తర్వాత సినీ కెరీర్ ను పక్కన పెట్టి ఉన్నత చదువుల కోసం విదేశాలకు చెక్కేసింది ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం. అయితే తన డైలీ లైఫ్ గురించి తరచూ అప్డేట్ ఇచ్చే పునర్నవి తాజాగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపింది. పునర్నవి భూపాలం ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది.

  ఇదే చివరిసారి కావాలని..

  పునర్నవి భూపాలం పోస్ట్ లో.. "నా కొత్త సంవత్సరం ఊపిరితిత్తుల సమస్యతో మొదలైంది. నేను అనారోగ్యానికి గురి కావడం ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నా" అని రాసుకొచ్చింది. ఈ వ్యాధితో బాధపడేవారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇక ఆమె అనారోగ్యం బారిన పడటంతో ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అయ్యారు. పునర్నవి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో విష్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

  English summary
  Bigg Boss Telugu 3 Fame Punarnavi Bhupalam Says She Is Suffered With Chest Congestion Post Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X