అర్ధరాత్రి నీకు దురద పెడితే.. నన్ను పిలిస్తే గోకి పెడుతా.. హీరోయిన్‌తో తెలుగు హీరో దారుణంగా!
Radhika Apte: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే సమస్య కొత్తది కాదు. కానీ ఈమధ్య కాలంలో పలువురు నటీమణులు ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఇలా బహిరంగంగా కామెంట్స్ చేయడం చర్చకు దారితీస్తోంది. మరికొంతమంది నిజంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, మరికొందరు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొన్ని విచిత్రపు మలుపులు తిరుగుతున్నాయి. అసలు ఎప్పుడూ ఇలాంటి ఆరోపణల ఊసే లేని స్టార్ హీరోల వైపు వేలు చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోయిన్ రాధికా అప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
హీరోయిన్ రాధికా అప్టే గురించి ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు రాధికా. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది. అనంతరం లయన్ సినిమాలో కూడా ఆయనతో కలిసి నటించింది. బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ అనేక సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాధికా 2005లో హిందీ చిత్రం వాహ్! లైఫ్ హో తో ఐసీ! ద్వారా చిన్న పాత్రలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమెకు మొదటి ప్రధాన పాత్ర 2009లో బెంగాలీ సినిమా అంతహీన్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. రాధికా తన బోల్డ్ రోల్స్, ఓపెన్ కామెంట్స్ కారణంగా తరచూ వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ది వెడ్డింగ్ గెస్ట్, పార్చ్డ్ వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం ఆమెను మరింత హాట్ టాపిక్‌గా మార్చింది.

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని ఓ ప్రముఖ తెలుగు హీరో వేధించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె ఆ హీరో పేరును మాత్రం బయటపెట్టలేదు. తాను టాలీవుడ్‌లో ఒక ప్రముఖ హీరోతో నటించేటప్పుడు చెడు అనుభవం ఎదురైందని వెల్లడించింది. ఆ స్టార్ హీరోతో పెద్దగా పరిచయం లేకపోయినా, ఒకసారి ఎలివేటర్‌లో వెళ్తున్నప్పుడు ఆయన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని రాధికా చెప్పింది.
రాధిక ఆప్టే మాటల్లోనే'ఓ స్టార్ హీరో ఎలివేటర్లు రూమ్ లోకి వెళ్ళేటప్పుడు అతడు అసభ్యకరంగా మాట్లాడారు. వాస్తవానికి ఆ హీరోకు నాకు అంతగా పరిచయం లేదు. కానీ నాతో అతిగా మాట్లాడారు. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ .. మీ బ్యాక్ దురద పెడితే.. నన్ను పిలవండి.. నేను మీ రూమ్ కి వచ్చి, రుద్దుతా.. అన్నారు. ఆ మాటలతోనే షాక్ అయ్యా.. వెంటనే 'వాట్?'అంటూ సీరియస్ గా చూశాను. ఆ ముసలి హీరో గుడ్ నైట్ అంటూ సైలెంట్ గా వెళ్ళిపోయాడు' అంటూ రాధికా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్-టాలీవుడ్ ఫ్యామిలియర్ హీరోయిన్ రాధికా ఆప్టే ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. "తనను ఓ తెలుగు స్టార్ హీరో వేధించాడు" అని చెప్పినప్పటికీ, ఆయన పేరు మాత్రం బయటపెట్టలేదు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోవడం గమనార్హం. అయితే, ఈ కామెంట్స్ వెలుగులోకి రావడంతో నెట్టింట్లో ఓ వర్గం నేరుగా ఒక ప్రముఖ హీరో వైపు వేళ్లుపెడుతోంది. కొందరు యాంటి ఫ్యాన్స్ కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అభిమాన వర్గం అంటోంది. మరి కొందరు మాత్రం "క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్తవి కావు, ఇలాంటి కామెంట్స్ రావడం ఇదే మొదటిసారి కాదు" అని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల రాధికా మళ్లీ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో, ఈ విషయం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇండస్ట్రీలోని కొంతమంది మాత్రం "ఫేమ్ కోసం ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని అంటున్నారు. మరోవైపు, రాధికా గతంలోనూ తన ఓపెన్ కామెంట్స్, బోల్డ్ రోల్స్ కారణంగా తరచూ వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. పార్చ్డ్, ది వెడ్డింగ్ గెస్ట్ వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాలు చేసి చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ తాజా వ్యాఖ్యలతో రాధికా పేరు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, సినీ వర్గాల్లో మాత్రం ఇంతకీ ఆ హీరో ఎవరు? అనే చర్చనీయంగా మారింది.


Click it and Unblock the Notifications











