For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2022లో ఒకేసారి 7 సినిమాలు.. రకుల్ డిమాండ్ మామూలుగా లేదు.. భారీగా ఆదాయం!

  |

  గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో తెలుగులో సరైన విజయాలు చూడలేకపోయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ బ్యూటీకి చాలా అవకాశాలు వస్తున్నాయి. రకుల్ కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే పద్ధతిలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారీ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంది. ఇక 2022 లో అమ్మడి నుంచి ఒకేసారి 7 సినిమాలు విడుదల కానున్నాయి. వాటి ద్వారా ఆమె భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

  Rakul Preet Singh On Doing Experimental Films | Filmibeat Telugu
   తల్లి సపోర్ట్ తోనే..

  తల్లి సపోర్ట్ తోనే..

  పంజాబీ కుటుంబానికి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఇక ఆమె కాలేజ్ లోకి వచ్చిన తర్వాత మోడలింగ్ పై తన ఇష్టాన్ని పెంచుకుంది. తల్లి సపోర్ట్ తోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రకుల్ చాలా తొందరగానే సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చేసింది. మొదట్లోనే బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ అమ్మడు మాత్రం తొందర పడకుండా కేవలం ఒక్క సినిమాను మాత్రమే పూర్తి చేసింది.

   మొదట్లోనే విజయాలు

  మొదట్లోనే విజయాలు

  కెరటం అనే తెలుగు సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించిన రకుల్ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, పండగ చేసుకో వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించడంతో ఈ బ్యూటీకి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం దక్కింది. కానీ కిక్ 2, బ్రూస్లీ వంటి పెద్ద సినిమాలు కాస్త నిరాశ పరచడంతో మళ్లీ రకుల్ క్రేజ్ తగ్గింది అనే వార్తలు వచ్చాయి.

   సక్సెస్ వచ్చిన వెంటనే డిజాస్టర్స్

  సక్సెస్ వచ్చిన వెంటనే డిజాస్టర్స్

  డిజాస్టర్ వచ్చిన ప్రతిసారి రకుల్ ప్రీత్ సింగ్ చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ వెంటనే బౌన్స్ అయ్యే విధంగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ గా నిలవడంతో ఈ బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మళ్లీ తీవ్రంగా నిరాశ పరిచాయి.

  హిందీలో బిజీగా..

  హిందీలో బిజీగా..

  గత ఏడాది వచ్చిన చెక్ సినిమా కొండపొలం సినిమాలు కూడా తెలుగులో ఈ బ్యూటీకి ఊహించని విధంగా చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికప్పుడు తన స్థాయిని పెంచుకునే విధంగా మంచి సినిమాలు చేస్తోంది. హిందీలో ఈ బ్యూటీ సిమ్లా మిర్చి, సర్దార్ గ్రాండ్ సన్ వంటి సినిమాల అనంతరం మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి.

   బాలీవుడ్ లోనే 6 సినిమాలు

  బాలీవుడ్ లోనే 6 సినిమాలు

  ఇక ఈ ఏడాది రకుల్ నుంచి ఆరు హిందీ సినిమాలు ఒక తమిళ్ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌తో డాక్టర్ జి, అమితాబ్ బచ్చన్ & అజయ్ దేవగన్‌లతో రన్‌వే 34, అజయ్ దేవగన్ & సిద్ధార్థ్ మల్హోత్రాతో థ్యాంక్ గాడ్, వంటి సినిమాలతో పాటు చత్రీవాలి, ఎటాక్, అక్షయ్ కుమార్‌తో మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు వస్తాయట. ఇక తమిళంలో కూడా ఒక సినిమా రానుంది.

   ఆదాయం ఎంతంటే..?

  ఆదాయం ఎంతంటే..?

  తెలుగు తమిళ్ హిందీలో ప్రస్తుతం ఈ రేంజ్ లో బిజీగా ఉన్న హీరోయిన్స్ మరొకరు లేరనే చెప్పాలి. ఇక ఒక్కో సినిమాకి కొట్టిన్నర నుంచి 2కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్న రకుల్ తక్కువ బడ్జెట్ లో వచ్చే కంటెంట్ ఉన్న సినిమాలకు కోటి కంటే తక్కువగానే తీసుకుంటుందట. ఇక ఫైనల్ ఈ ఏడాది రాబోయే సినిమాలతో అమ్మడు దాదాపు 10కోట్లకు పైగానే ఆదాయం అందుకుంటుందని సమాచారం

  English summary
  Rakul preet singh back to back seven releases in 2022 and remuneration details,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion