For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rakul Preet Singh ఆ నిర్మాతతో నా సోదరి పెళ్లి.. మ్యారేజ్ వార్తను తమ్ముడు లీక్.. ట్వీట్‌తో ఉతికిపారేసిన రకుల్

  |

  అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ వ్యవహారం తరుచూ జాతీయ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తుంటుంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంలో రకుల్ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల తన ప్రియుడితో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ఘనంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొన్నది. అయితే జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలపై స్పందించిన తన తమ్ముడిపై రకుల్ ప్రీత్ సింగ్ ఒంటికాలిపై లేచింది. తన పెళ్లి గురించి రకుల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ వివారాల్లోకి వెళితే..

  బాలీవుడ్ నిర్మాతతో డేటింగ్, రిలేషన్‌షిప్

  బాలీవుడ్ నిర్మాతతో డేటింగ్, రిలేషన్‌షిప్

  రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీ డేటింగ్, రిలేషన్‌షిప్ వ్యవహారంపై బాలీవుడ్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్దరి చెట్టాపట్టాల్ వేసుకొని రెస్టారెంట్లు, పబ్‌లు, హోటల్స్, విహారయాత్రలతో హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

  బర్త్ డే రోజున ఎమోషనల్‌గా జాకీ భగ్నానీ

  బర్త్ డే రోజున ఎమోషనల్‌గా జాకీ భగ్నానీ

  ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే రోజున ప్రియుడు జాకీ భగ్నానీ శుభాకాంక్షలు అందిస్తూ.. నీ గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. ఓ కూతురుగా, సోదరిగా, ఫ్రెండ్‌గా, నా పార్ట్‌నర్‌గా నువ్వు బెస్ట్. కలలు ఎలా కనాలి.. వాటిని ఎలా సాకారం చేసుకొవాలనే విషయం గురించి నీవు చెప్పే మాటలు నాకు స్పూర్తిని అందిస్తాయి. నీ జీవితంలో సుఖ: సంతోషాలు మెండుగా ఉండాలి. మంచి కథలతో మరిన్ని సినిమాలు చేయాలి అని జాకీ భగ్నానీ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

  త్వరలోనే జాకీ, రకుల్ పెళ్లి

  త్వరలోనే జాకీ, రకుల్ పెళ్లి

  ఇదిలా ఉండగా, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ జాతీయ దిన పత్రిక ఈటీతో మాట్లాడుతూ.. జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్‌షిప్, పెళ్లి గురించి స్పందించారు. నిర్మాత జాకీ భగ్నానీ నిర్మించిన కొన్ని చిత్రాల్లో నా సోదరి రకుల్ నటించింది.ఆ సమయంలో వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. ఆ రిలేషన్‌ పెళ్లివరకు వచ్చింది. త్వరలోనే జాకీ, రకుల్ పెళ్లి జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం జరుగలేదు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  మ్యారేజ్ అనేది క్లైమాక్స్ అంటూ

  మ్యారేజ్ అనేది క్లైమాక్స్ అంటూ

  జాకీతో తన పెళ్లి గురించి నా సోదరి రకుల్ అధికారికంగా ప్రకటన చేస్తుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారో అప్పుడే తన మనసులోని మాట చెబుతుంది. ఒక రిలేషన్‌కు మ్యారేజ్ అనేది క్లైమాక్స్. అది ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని నేను కచ్చితంగా చెప్పలేను అని రకుల్ సోదరుడు అమన్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకొన్నారు.

  పెళ్లి వాయిదా అందుకే అంటూ

  పెళ్లి వాయిదా అందుకే అంటూ

  బాలీవుడ్‌లో జాకీ భగ్నానీ టాప్ ప్రొడ్యూసర్. ఆయన చేతిలో చాలా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే రకుల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల బిజీలో పడి పెళ్లి గురించి ఆలోచించడం లేదు. జీవితంలో సాధించే లక్ష్యాలు వారికి చాలా ఉన్నాయి. అందుచేత పెళ్లి వాయిదా పడుతున్నది. వారిద్దరు తమ పెళ్లి గురించి త్వరలోనే నిర్ణయం తీసుకొంటారు అని రకుల్ సోదరుడు అమన్ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  నా జీవితాన్ని నీవు డిసైడ్ చేస్తావా? రకుల్ ఫైర్

  నా జీవితాన్ని నీవు డిసైడ్ చేస్తావా? రకుల్ ఫైర్

  అయితే తన సోదరుడు అమన్ ఇచ్చిన ఇంటర్వ్యూపై రకుల్ ప్రీత్ సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్‌లో రకుల్ పోస్టు పెట్టడమే కాకుండా అమన్ అకౌంట్‌కు ట్యాగ్ చేసి.. నా పెళ్లి గురించి నీవు కన్ఫర్మ్ చేశావా? ఆ విషయం నాకు కనీసం చెప్పలేదు బ్రో. నీ వ్యవహారం చాలా ఫన్నీగా ఉంది. నా జీవితం గురించి విషయాలను అనుమతి లేకుండా నీవు ఎలా చెబుతావు అని రకుల్ తమ్ముడికి సోషల్ మీడియాలో తలంటుపోసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ ట్వీట్ వైరల్‌గా మారింది.

  English summary
  Heroine Rakul Preet Singh serious on her brother Aman Preet Singh who leaks relationship and Marriage with Jackky Bhagnani. She tweeted that, AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it’s funny how I don’t have news about my life .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X