Ramya Krishnan: ‘నా జీవితాన్ని మార్చేసిన ఘటన అదే.. ’
Ramya Krishnan: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ (Ramya Krishnan).నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులో అజరామరమైన గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే తెరపై అడుగుపెట్టిన రమ్యకృష్ణ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించింది. నరసింహ, బాహుబలి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నారు. అయితే.. ఓ ఘటన వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయిందట. ఇంతకీ రమ్యకృష్ణ జీవితాన్ని మార్చేసిన ఘటన ఏంటీ?
రమ్యకృష్ణ అంటేనే వెర్సటైల్ పెర్ఫార్మర్. ఏ పాత్రలో నటించినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి. "నరసింహ" సినిమాలో నీలాంబరిగా ఆమె చేసిన నటనకు ఫ్యాన్స్ ఫిదా కాగా, "బాహుబలి"లో శివగామి పాత్రతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటారు. అగ్రహీరోలతో, అగ్రదర్శకులతో కలిసి నటిస్తూ రమ్యకృష్ణ తన కెరీర్‌ను అజరామరంగా మలిచుకున్నారు. దేవతలా మెప్పించినా, విలన్‌లా భయపెట్టినా, రాజకీయ నాయకురాలిగా ఆకట్టుకున్నా ప్రతి పాత్రలో ఆమె నటన ప్రత్యేకతను చాటింది.

తాజాగా రమ్యకృష్ణ జీ తెలుగు ప్రసారం చేస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా" కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోను హీరో జగపతిబాబు హోస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే రమ్యకృష్ణ స్టైలిష్‌గా, కంఫర్ట్‌గా హాజరై తన ఉత్సాహంతో, చమత్కారాలతో సెట్స్‌లో జోష్ నింపారు. ఈ షోలో రమ్యకృష్ణ ఎన్నో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా బహుబలి సినిమా గురించి జగపతిబాబు సరదాగా మాట్లాడుతూ, "మీకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా.. కానీ బాహుబలి సినిమాలో ఆమె చేయాల్సిన శివగామి పాత్ర మీరు చేశారు. దానిపై మీ ఫీలింగ్ ఏమిటి?" అని అడగగా రమ్యకృష్ణ నేరుగా స్పందిస్తూ..
"అది నాకేం తెలియదు. నాకు ఆ పాత్ర వచ్చింది, నేను చేశాను! అంతే." అంటూ తన స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసింది.
అదే సందర్భంలో బహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.. "నిజంగా నేను బాహుబలి సినిమాలో నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తాను. శ్రీదేవి గురించి చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఆమెను గ్లామరస్ పాత్రల్లోనే చూశాను. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఆమె గ్లామర్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఆ స్థాయిలో ఆమెకు సాటి లేరు" అని రమ్యకృష్ణ చెప్పారు.
దీనికి జగపతిబాబు ప్రశంసిస్తూ, "బాహుబలిలో శివగామి పాత్రకు మీరు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. మీరు ఆ పాత్రలో లివింగ్ లెజెండ్‌లా కనిపించారు" అని అన్నప్పుడు, రమ్యకృష్ణ హృదయానికి హత్తుకునేలా సమాధానమిచ్చారు. "కొన్నిసార్లు మన జీవితంలో అనుకోకుండా అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతమే బాహుబలి. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది" అని రమ్యకృష్ణ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
అదే సమయంలో శివగామి పాత్ర ఎలా దక్కిందనే విషయాన్ని రమ్యకృష్ణ ఆసక్తికరంగా వెల్లడించారు. "ఆ సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ నాకు కాల్ చేసి, '40 రోజుల కాల్ షీట్స్ కావాలి' అన్నారు. నేను అప్పట్లో ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండడంతో 'అంత కాలం కుదరదు' అని చెప్పి ఫోన్ పెట్టేశాను. కానీ తర్వాత ఆ పాత్ర స్క్రిప్ట్ విన్నాక, దానిలోని పవర్ అర్థమైంది. నిజంగానే ఆ రోల్ చేస్తున్నప్పుడు నేను రాజమాతలా ఫీల్ అయ్యాను," అని ఆమె చెప్పారు.
తన ప్రత్యేక శైలిలో రమ్యకృష్ణ చివరగా "ఇది నా మాట... నా మాటే శాసనం!" అని బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెబుతూ షోలో జోష్ నింపేసింది.
ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస సినిమాలు, వెబ్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతి చోటా తన ఓనర్ని నిలబెట్టుకుంటున్నారు. 40 ఏళ్లకుపైగా కెరీర్‌లో ఎన్నో మలుపులు చూసిన ఈ నటి, బాహుబలితో తన రెండో ఇన్నింగ్స్ పీక్ స్థాయికి చేర్చింది. రమ్యకృష్ణ మాటల్లో చెప్పాలంటే "నా జీవితంలో జరిగిన పెద్ద మ్యాజిక్ అదే - బాహుబలి". ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో రమ్యకృష్ణ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అభిమానులు "శివగామి లెజెండ్ ఫారెవర్", "రమ్యకృష్ణ అంటే యాక్టింగ్ క్వీన్ ", "నీలాంబరి నుంచి శివగామి వరకూ ఎమోషన్ జార్నీ" అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











