పవన్ కల్యాణ్‌తో ఎట్టకేలకు ఆ కోరిక తీరింది.. రాశి ఖన్నా ఎమోషనల్ కామెంట్స్
Rashii Khanna - Pawan Kalyan: తెలుగు సినీ ప్రియులకు అందాల భామ రాశీ ఖన్నా పరిచయం అక్కర్లేదు. "మద్రాస్ కేఫ్" చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, అందం, అభినయంతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత "జై లవ్ కుశ", "వెంకీ మామ", "ప్రతి రోజు పండగే" వంటి చిత్రాలతో తాను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ఈ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌తో ఎట్టకేలకు ఆ కోరిక తీరిందంటూ రాశి ఖన్నా ఎమోషనల్ కామెంట్స్. ఇంతకీ ఆ కోరిక ఏంటీ?
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా మళ్లీ తెలుగు వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్'నటిస్తుంది. ఇందులో రాశీ ప్రధాన పాత్రలో నటించగా, శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఈ ఏడాది చివర ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో హీరోయిన్ రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. రాశీ మాట్లాడుతూ, "ఈ సినిమా ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే చేశాను. హరీష్ శంకర్ కాల్ చేసినప్పుడు స్క్రిప్ట్ కూడా చూడలేదు, పవన్ కల్యాణ్ నటిస్తున్నారని తెలుసుకున్నా, వెంటనే ఒప్పానీ" అని పేర్కొన్నారు.

రాశీ ఖన్నా మాట్లాడుతూ 'చాలా మందికి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కల ఉంటుంది. నా కూడా పవన్ కళ్యాణ్ గారితో నటించాలని, ఆయనతో స్కీన్ షేర్ చేసుకోవాలని కోరిక. ఈ మూవీ ద్వారా ఆ కోరిక పూర్తయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పవన్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా..'అని రాశీ ఖన్నా చెప్పింది. అలాగే, 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ అభిమానులందరికీ ఒక విందు భోజనంలా ఉండబోతోందని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం రాశీ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఇక రాశీ ఖన్నా 'తెలుసు కదా' అనే మరొక చిత్రంలో కూడా నటిస్తోంది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, దర్శకురాలు నీరజ్ కోనా రూపొందిస్తున్న ఈ సినిమా, ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో రాశీ ఖన్నా కనిపించబోతుంది. ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో, ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద, రాశీ ఖన్నా తెలుగు తెరపై మళ్లీ రీ ఎంట్రీతో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్‌మెంట్, స్టయిల్, పవన్ కల్యాణ్ సత్తా ఫ్యాన్ సర్వీస్ అందించబోతోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్', 'తెలుసు కదా' సినిమాలతో రాశీ ఖన్నా అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ చేసింది.


Click it and Unblock the Notifications











