For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాజీ ప్రియుడిని కలిసిన రష్మిక: బ్రేకప్ తర్వాత తొలిసారి అలా కనిపించడంతో అనుమానాలు!

  |

  తెలుగులో తక్కువ సినిమాలే చేసినా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. దీంతో సొంత పరిశ్రమను వదిలేసి.. టాలీవుడ్‌లోనే ఎక్కువ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. దీంతో ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన మాజీ ప్రియుడితో మరోసారి కలిసింది రష్మిక. బ్రేకప్ అయిన తర్వాత తొలిసారి వీళ్లిద్దరూ అలా కనిపించడంతో అనుమానాలు మొదలయ్యాయి. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

   ఛలో అంటూ వచ్చి.. వరుసగా కొట్టేసింది

  ఛలో అంటూ వచ్చి.. వరుసగా కొట్టేసింది

  ‘ఛలో' సినిమాతో తొలి సక్సెస్‌ను అందుకున్న రష్మిక మందన్నా.. ఆ తర్వాత ‘గీత గోవిందం' వంటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీటితో పాటు ఈ మధ్య వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' కూడా హిట్ అవడంతో అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. ‘దేవదాస్', ‘డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను నిరాశ పరిచింది.

  నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది

  నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది

  2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైంది రష్మిక మందన్నా. గూగుల్‌లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే ఈ కన్నడ భామ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన‌ సమాచారం కనిపిస్తోంది. తక్కువ సినిమాలే చేసినా ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020' గా ర‌ష్మిక ఎంపిక కావ‌డంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నట్లైంది.

   ట్విట్టర్‌లోనూ రష్మిక ఘనత సాధించింది

  ట్విట్టర్‌లోనూ రష్మిక ఘనత సాధించింది

  కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది లాక్‌డౌన్ కారణంగా అభిమానులకు దూరంగా ఉన్నారు సెలెబ్రిటీలు. సినిమాల పరంగా దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2020లో ఎక్కువగా ట్వీట్స్ అందుకున్న హీరోయిన్ల జాబితా కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఇందులో రష్మిక మందన్నాకు నాలుగో స్థానం దక్కడం విశేషం.

   పర్సనల్ లైఫ్‌లో మాత్రం భారీ మలుపు

  పర్సనల్ లైఫ్‌లో మాత్రం భారీ మలుపు

  తన మొట్టమొదటి కో స్టార్, కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక మందన్నా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ‘కిర్రాక్ పార్టీ' సమయంలోనే ప్రేమలో పడిన వీళ్లిద్దరూ.. చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతేకాదు, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో వివాహానికి ముందు విడిపోయారు. దీంతో ఈ జంట దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

  మొదటి పాటతో రికార్డు క్రియేట్ చేసేసింది

  రష్మిక మందన్నా నటించిన మొదటి చిత్రం ‘కిర్రాక్ పార్టీ'. ఈ సినిమాలోని ‘బెల‌గెద్దు యారా మ‌గువా' అనే పాటకు యూట్యూబ్‌లో వంద మిలియ‌న్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుందీ కన్నడ భామ. అంతేకాదు, ట్విట్టర్ దీని గురించి చేసిన ట్వీట్‌కు మాజీ ప్రియుడు, చిత్ర హీరో రక్షిత్ శెట్టి పేరును కూడా ట్యాగ్ చేసి అందరికీ షాకిచ్చింది.

   బ్రేకప్ తర్వాత తొలిసారి అలా కనిపించింది

  బ్రేకప్ తర్వాత తొలిసారి అలా కనిపించింది

  రష్మిక తనను ట్యాగ్ చేయడంతో రక్షిత్ శెట్టి కూడా దీనిపై స్పందించాడు. ‘నువ్వు ఇంకా ఇంకా పైపైకి ఎదగాలి. నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నా' అంటూ ఆమెను ఉద్దేశించి రిప్లై ఇచ్చాడు. బ్రేకప్ తర్వాత వీళ్లిద్దరూ ఇలా కలవడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు, చాలా కాలం తర్వాత కనిపించిన ఈ పరిణామంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  Rashmika Mandanna, is an Indian film actress and model who works predominantly in Telugu and Kannada films. She is popularly dubbed by the media and Kannada film industry as the 'Karnataka Crush'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X