For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక మందన్నా: దానికి వయసుతో పని లేదు.. అతడిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ!

  |

  చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మెస్మరైజ్ యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంటర్ అయిన ఈ భామ.. అన్ని వర్గాల, భాషల ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. అదే సమయంలో వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మార్క్ చూపించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఓ భారీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ వయసు గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా మొదలైన రష్మిక ప్రయాణం

  అలా మొదలైన రష్మిక ప్రయాణం

  'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రంతో రష్మిక మందన్నా హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించిందామె. దీంతో అదే భాషలో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది.

  Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్‌లో!

  టాలీవుడ్‌లో హవా... వరుస ఆఫర్లు

  టాలీవుడ్‌లో హవా... వరుస ఆఫర్లు

  కన్నడ బ్యూటీనే అయినా రష్మిక మందన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు భారీ విజయాలను అందుకుంది. 'ఛలో' నుంచి వరుసగా 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో లక్కీ హీరోయిన్ అని పేరును సైతం తెచ్చుకుంది. తద్వారా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.

  దేశ వ్యాప్తంగా గుర్తింపు అందుకుని

  దేశ వ్యాప్తంగా గుర్తింపు అందుకుని

  తన కెరీర్‌లో రష్మిక చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం 2020 సంవత్సరానికి గానూ 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపిక కావడమే. గతంలో ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె పేరొందింది.

  Bigg Boss: లోబో పరువు తీసిన ఫేమస్ యాంకర్.. ఉమాదేవితో సరసాలు.. రెండో పెళ్లి అంటూ సంచలన వ్యాఖ్యలు

  అన్నింట్లోనూ ఉంటూ ఫుల్ బిజీగా

  అన్నింట్లోనూ ఉంటూ ఫుల్ బిజీగా

  ప్రస్తుతం రష్మిక మందన్నా తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు 'మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటిస్తూ సాగుతోంది.

  అక్కడ మాత్రం రచ్చ చేస్తోందిగా

  అక్కడ మాత్రం రచ్చ చేస్తోందిగా

  సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది. దీంతో వార్తల్లో నిలుస్తోంది.

  Bigg Boss: నామినేషన్‌లో ఉన్న రవికి మరో బిగ్ షాక్.. అడ్డంగా దొరకడంతో ఎలిమినేషన్ ప్రమాదం

  డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక

  డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక

  రష్మిక మందన్నా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న 'మిషన్ మజ్ను' అనే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అలాగే పర్సనల్ మేటర్ అయిన డేటింగ్ గురించి కూడా ఓపెన్ అయిందీ కన్నడ హీరోయిన్.

  అతడిని ప్రేమిస్తే తప్పేంటి అని

  అతడిని ప్రేమిస్తే తప్పేంటి అని

  సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో 'మీ కంటే చిన్న వాడితో డేటింగ్ చేస్తారా' అని ఒకరు రష్మికను ప్రశ్నించారు. దీనికామె 'ప్రేమకు వయస్సుతో సంబంధం ఏముంది? కాకపోతే వాళ్లు మిమ్మల్ని, మీ అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నాలు చేయకూడదు. అలా అయితేనే వయసు అన్నది డేటింగ్‌కు సమస్యగా మారకుండా ఉంటుంది' అంటూ వివరణ ఇచ్చింది.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Now Doing Few Films At a Time. In Latest interview.. She Gave Clarity about Boyfriend Age
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X