అందుకే విజయ్ ని సొంతం చేసుకున్నావా? రష్మిక ఎఫైర్ జగ్గూభాయ్ లీక్

Rashmika Mandanna- Vijay Deverakonda: టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట ఒకటి. ఈ జంట ప్రేమ వ్యవహారం గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సెలబ్రెటీ కపుల్ఎప్పుడూ తమ రిలేషన్‌షిప్‌పై స్పష్టత ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో వీరి క్యూట్ కెమిస్ట్రీ చూసి అభిమానులు "ఇద్దరూ నిజంగానే కపుల్" అని నమ్ముతూనే ఉన్నారు. ఇటీవల దసరా పండుగ వేళ ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో, కేవలం కొద్ది మంది అతిథుల మధ్య సింపుల్‌గా నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ గానీ, రష్మిక గానీ అధికారిక ప్రకటన చేయలేదు.

ఇలాంటి రూమర్స్ నడుమ, రష్మిక తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షోలో నేషనల్ క్రష్ సందడి చేస్తూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. మొదట షోలో అడుగుపెట్టిన రష్మిక, తన ఫేవరెట్ స్టైల్‌లో 'లవ్ సింబల్' చూపిస్తూ అభిమానులను విష్ చేసింది. ఈ సమయంలో జగపతిబాబు కూడా రష్మిక సిగ్నేచర్ స్టైల్‌ని ఇమిటేట్ చేయడంతో షోలో సరదా వాతావరణం నెలకొంది. ఆ తరువాత జగపతి బాబు తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు.

Rashmika Mandanna Drops Hints About Engagement with Vijay Deverakonda on Jagapathi Babu Show

"నిన్ను అభిమానులు నేషనల్ క్రష్ అంటారు, కానీ నేను మాత్రం నిన్ను గాలి పిల్ల అని పిలుస్తా..!" అని పిలుస్తా అనడంతో రష్మిక నవ్వుతూ స్పందించారు. అలాగే జగపతి బాబు.. 'నీలైఫ్‌లోని "విజయ్" చాలా స్పెషల్ కాదా. "నీ జీవితంలో విజయ్ అనే పేరు ప్రత్యేకమైందిగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్రెండ్‌, విజయ్ సేతుపతి ఫ్యాన్‌, దళపతి విజయ్ ఆల్ టైమ్ ఫేవరెట్‌. అందుకే 'విజయ్', 'విజయము'ను సొంతం చేసుకున్నావా?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న రష్మిక మొదట షాక్‌ అయినా వెంటనే చిరునవ్వుతో తప్పించుకున్నారు.

తర్వాత ఆమె చిన్ననాటి ఫోటోను చూపించి జగపతిబాబు టీజ్ చేయగా, రష్మిక చెన్నైలో ఉన్నప్పుడు తీసినదని తెలిపింది. "అప్పుడు కూడా విజయ్ ఉన్నాడా?" అని ప్రశ్నించగానే రష్మిక సిగ్గుతో నవ్వుతూ, "ఏంటి సార్!" అంటూ తన ఎక్స్‌ప్రెషన్స్ తో సమాధానం ఇచ్చింది.

ఇలా షోలో సరదాగా కొనసాగుతుండగా, జగపతిబాబు చివర్లో ఆమె చేతిలో ఉన్న రింగ్స్ గురించి అడిగారు. "ఈ ఉంగరాలు సెంటిమెంటా, లేక స్పెషలా?" అని. దానికి రష్మిక క్యూట్‌గా "చాలా ఇంపార్టెంట్ రింగ్స్ సార్..." అని సమాధానమిచ్చారు. వెంటనే జగపతిబాబు "అందులో ఒకటి చాలా స్పెషల్ అయి ఉంటుందేమో!" అని పరోక్షంగా విజయ్‌ దేవరకొండను సూచిస్తూ సెటైర్ వేశారు. దీంతో రష్మిక కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్ తో సమాధానం ఇచ్చింది.

రష్మిక సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు "విజయ్ రింగ్‌ కదా!" అంటూ గోల చేయగా, రష్మిక కూడా ఆ గోలను ఆస్వాదిస్తూ "నాకూ ఈ గోల చాలా నచ్చింది" అంటూ చిలిపిగా రియాక్ట్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు "ఇద్దరూ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో చూద్దాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల 'ది గర్ల్‌ఫ్రెండ్‌' మూవీ ప్రమోషన్‌లో కూడా ఒక అభిమాని విజయ్‌తో ఎంగేజ్మెంట్ గురించి అడగగా, రష్మిక "మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం... కానీ ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతాను" అంటూ ప్రశ్నను దాటేశారు. ఆ సమాధానం తర్వాత నెటిజన్లు "ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ అయ్యింది" అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న విడుదల కానుంది. అంతేకాకుండా 'మైసా' అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు, విజయ్ దేవరకొండతో కొత్త సినిమా ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలా రష్మిక, విజయ్ జంట చుట్టూ ఎప్పటిలాగే ప్రేమ, రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. అభిమానులు మాత్రం "వీళ్లిద్దరూ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో... ఆ రోజు టాలీవుడ్‌లో పండుగే!" అంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X