Rashmika Mandanna:విజయ్ దేవరకొండతో పెళ్లి.. తొలిసారి స్పందించిన రష్మిక.. ఏమన్నారంటే?
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna)ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకెళ్తున్నారు. వరుస విజయాలను అందుకుంటూ సార్ట్ హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడంతో అందాల భామ రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. వరుస ప్రాజెక్టులతో పుల్ బిజీగా మారిన ఈ అమ్మడు తాజాగా తన పర్సనల్ లైఫ్‌పై ఓ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఆమె, విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే ?
ప్రస్తుతం రష్మిక మందన్నా హిందీ, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యం 'పుష్ప' సక్సెస్ తో రష్మిక లెవల్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో రష్మిక.. శ్రీవల్లి పాత్రతో నటించి మెప్పించింది. పుష్ప, పుష్ప 2 సినిమాలు బ్లాక్ బ్లసర్ హిట్స్ గా మారడంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. ఈ సినిమా కేవలం అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు.. రష్మిక కెరీర్ లో కూడా మైల్ స్టోన్ మూవీగా మారింది. ఈ సక్సెస్ తో రష్మిక టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా వరుస ప్రాజెక్టులతో ముందుకు దూసుకెళ్లుంది.

ఇప్పటికే ఈ ఏడాది కుబేర, థామా, ఛావా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక. ఇప్పుడు "ది గర్ల్ ఫ్రెండ్"అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌లో రష్మిక జోరుగా పాల్గొంటోంది. "ది గర్ల్ ఫ్రెండ్" చిత్రం ఒక రొమాంటిక్ డ్రామాగా రూపొందుతుండగా, ఇందులో రష్మిక పాత్ర ముఖ్య హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.
ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ ఈవెంట్‌లో రష్మిక సందడి చేసింది. ఈ సమయంలో యాంకర్.. హీరోయిన్ రష్మికను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "ఒక వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంచుకోవడానికి మీరు ఏం చూస్తారు?" అని అడగగా.. రష్మిక కంటే.. అక్కడున్న అభిమానులు " ఈ ప్రశ్నను విజయ్ దేవరకొండని అడగాలి!" అంటూ అరిచారు. ఈ కామెంట్స్ విన్న రష్మిక నవ్వుతూ సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ నవ్వులో చాలా అర్థాలున్నాయని ప్రేక్షకులు కామెంట్ చేశారు.
ఇక యాంకర్ అక్కడితో ఆగకుండా మరోసారి "మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు?" అని అడిగారు అప్పుడే ఆడియన్స్ నుంచి మళ్లీ "రౌడీ లాంటి వాళ్లు!" అంటూ గట్టిగా అరిచారు. (రౌడీ అంటే విజయ్ దేవరకొండకు ఫ్యాన్ నేమ్ అని తెలిసిందే.) దాంతో రష్మిక సిగ్గు పడుతూ, "అందరికీ తెలుసు... అంతే అంతే..." అంటూ చేతితో సంకేతాలు ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె సమాధానం వైరల్ అయింది.
రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం తర్వాత ఆమె తొలిసారిగా పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించడం కూడా ఆసక్తి రేపింది. గత నెల (అక్టోబర్ 3)న వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య సింపుల్ వేడుకగా జరిగినట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఇద్దరూ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ట్రైలర్ ఈవెంట్‌లో రష్మిక సమాధానం మాత్రం ఆ వార్తలపై పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. "మాటల్లో చెప్పకపోయినా రష్మిక బాడీ లాంగ్వేజ్ అన్నీ చెప్పేసింది" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక రష్మిక, విజయ్ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వకపోయినా, పలు సందర్భాల్లో ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లడం, అవార్డ్ ఫంక్షన్లలో కలిసి కనిపించడం, సోషల్ మీడియా పోస్టులు చూసి అభిమానులు "ఇది నిజమైన ప్రేమే" అని అంటున్నారు. ఇలా సినిమా ప్రమోషన్‌లో పరోక్షంగా ఇచ్చిన రష్మిక సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. "విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి రష్మిక మొదటిసారి క్లారిటీ ఇచ్చింది"అనే కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. భవిష్యత్తులో రష్మిక - విజయ్ పెళ్లి గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











