బాలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చేసిన రష్మిక.. కారణం అదేనట!

By Rajababu

కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ సినీ రంగంలోకి దూసుకొచ్చిన రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్‌లో పాగా వేసింది. తాజాగా విజయ్ దేవరకొండతో కలసి నటించిన గీతా గోవిందంతో ఓ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. కెరీర్ ఆరంభంలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన యువ హీరోయిన్‌గా ఓ ఘనతను సాధించింది.

ప్రస్తుతం కన్నడ, తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టిన రష్మికకు బాలీవుడ్ నుంచి ఓ బ్రహ్మండమైన ఆఫర్ వచ్చిందట.

కథ, పాత్ర నచ్చకపోవడంతో బాలీవుడ్ చిత్రాన్ని అంగీకరించలేదని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. కథ, పాత్ర బాగుండి. తన కెరీర్‌కు దోహదపడితే ఏ భాషలోనైనా నటిస్తాను అని ఇటీవల రష్మిక చెప్పింది.

Rashmika Mandanna: I am not happy with Bollywood offers

గీతా గోవిందం చిత్రం తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న దేవదాస్ చిత్రంలో రష్మిక నటిస్తున్నది. ఈ చిత్రంలో నానికి జోడిగా కనిపించబోతున్నారు.

గీతా గోవిందం తర్వాత మరోసారి విజయ్ దేవరకొండతో జతకట్టి డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక నటిస్తున్నది. అలాగే యజమన అనే కన్నడ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ చిత్రం నిర్మాణ దశలోనే ఉంది. అంతేకాకుండా మరికొన్ని స్క్రిప్టులను వింటున్నట్టు ఇటీవల చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X