Just In
- 2 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 4 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 36 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదే నేను చేసిన పాపం.. ప్లీజ్ ట్రోల్ చేయడం ఆపండి.. వేడుకున్న హీరోయిన్

మీడియా ముందు ఎవ్వరైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఓ సారి మాట జారితే.. వెనక్కి తిరిగి వచ్చేయదు. మరీ మీడియా ముందైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒక్కసారి మాట్లాడితే దాన్ని వందసార్లు వేస్తారు. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అప్పటి వరకు ఉన్న డ్యామేజ్ పంక్చర్ అవుతుంది. సరదాగా మాట్లాడుతూ ఓ హీరో.. హీరోయిన్ గురించి మాట్లాడుతూ చేసిన ఫన్నీ కామెంట్స్.. ఇప్పుడామెకు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చాయి. ఇంతకీ ఆ కథేంటో ఓ సారి చూద్దాం.

నోరు జారిన నితిన్..
యంగ్ హీరో నితిన్, రష్మిక మందాన్న జంటగా వస్తోన్న చిత్రం భీష్మ. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, పాటలు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలవబోతోందని తెలుస్తోంది. తాజాగా భీష్మ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వీరిద్దరు.. అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే నితిన్ నోరు జారి రష్మిక సీక్రెట్ చెప్పేశాడు.

కుక్కుబిస్కెట్లు..
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆకలేస్తే రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంద'ని పొరపాటున నోరు జారాడు. ఆ విషయం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుందని.. ఆ కామెంట్లకు వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వస్తుందని వారికి అప్పుడు తెలిసి ఉండదు.

ఓ రేంజ్‌లో ట్రోల్స్..
ఏ ముహూర్తాన ఆ కామెంట్స్ చేశాడో గానీ.. రష్మికను నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. అసలే రష్మికపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుందంటే.. ఇలా అడ్డంగా దొరికితే.. ఇంకేమైనా ఉంటుందా? రష్మికపై లెక్కలేనన్ని మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.

అదే నేను చేసిన పాపం..
తాజాగా ఈ విషయంపై రష్మిక స్పందిస్తూ.. నేను ఒకసారే కుక్క బిస్కెట్ చిన్న ముక్క మాత్రమే తిన్నానని తెలిపింది. అది నితిన్ చూస్తుండగా తాను చేసిన పాపమని సరదాగా వ్యాఖ్యానించింది. ఎవరికీ చెప్పడని అనుకున్నానని.. కానీ తను ఇంత సిల్లీగా తీసుకుని మీడియా ముందు ఓపెన్ అవుతాడని అనుకోలేదని తెలిపింది. పైగా చెప్పిన తర్వాత అంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది.

ప్లీజ్ ట్రోల్ చేయడం ఆపండి..
ఇలా జరుగుతుందని ముందే ఊహించి ఉంటే నితిన్ పని అప్పుడే చెప్పేదాన్నంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. తిండి అనే కాదు..చాలా విషయాల్లో ప్రయోగాలు చేయడం తనకు అలవాటని, కాకపోతే కుక్క బిస్కెట్ గురించి అందరికీ తెలిసిపోయిందని వెల్లడించింది. ప్లీజ్ .. ఇక ట్రోల్ చేయడం ఆపేయండని అందర్నీ వేడుకుంది.