Don't Miss!
- News
సింహంలా మీ బిడ్డ ఒక్కడే - పొత్తులపై గర్జించిన సీఎం జగన్ : అదే నా ధైర్యం..!!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లిప్ కిస్ పై రష్మిక మందన్నా.. రాత్రంతా కూర్చోని ఏడ్చేదాన్ని
చూపు తిప్పుకోకుండా చేసే అందం, అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా. మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ బ్యూటీ మొదట చిన్న సినిమాలతోనే మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత అగ్ర హీరోలతో అవకాశాలను అందుకుంది. ఫలింతంగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఇక స్టైలిష్ స్టార్ అర్జున్ తో నటించిన పుష్ప మూవీతో బీభత్సమైన క్రేజ్ వచ్చింది. దీంతో వరుసగా ఇటు కోలీవుడ్ అటు బాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అందులో ఒకటి గుడ్ బై చిత్రం. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లలో తన లిప్ లాక్ గురించి షాకింగ్ సమాధానాలు ఇచ్చింది ఈ బ్యూటి.

హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది.

ఛలో' నుంచి మొదలుకొని..
ఇక, 'ఛలో' మూవీతో తెలుగులోకి వచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని షాకివ్వడంతో పాటు పాపులర్ అయింది. ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మికకు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

దేశవ్యాప్తంగా గుర్తింపు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం గుడ్ బై. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా.

గ్లామర్ లుక్ లో..
గుడ్ బై మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇందులో రష్మిక మందన్నా డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో తొలిసారిగా నటించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను బాగానే చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్లలో పాల్గొంటుంది రష్మిక మందన్నా.

విపరీతమైన ట్రోలింగ్..
ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రష్మిక మందన్నా బాలీవుడ్ మీడియాతో ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాల్లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్లలో నటించింది రష్మిక మందన్నా. ఈ విషయం గురించి రష్మికను యాంకర్ అడగ్గా.. మొదటి సినిమాలో ఆ సీన్లు చేసినప్పుడు పెద్దగా ఏంకాలేదు. కానీ డియర్ కామ్రెడ్ సినిమాలో లిప్ కిస్ సీన్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

పబ్లిసిటీ కోసమే చేశామని..
అదంతా పబ్లిసిటీ కోసమే చేశామని విమర్శలు వచ్చాయి. దీంతో చాలా బాధపడ్డాను. అంతేకాకుండా దీంతో రాత్రి పీడకలలు కూడా వచ్చేవి. ఆ కలలు నిజమో కాదో కూడా అర్థమయ్యేది కాదు. నిద్ర లేచి బెడ్ మీద కూర్చొని రోజు ఏడ్చేదాన్ని. పక్కన ఎవరు లేకపోవడంతో రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని. నిద్ర కూడా సరిగ్గా పోయేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.