Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి తర్వాత నాలాంటి కూతురిని కనాలి.. నితిన్‌కు షాకిచ్చిన రష్మిక మందన్న
ఛలో సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన రష్మిక మందన్న ఇక అక్కడ నుంచి వెనక్కి చూసుకోలేదు. గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్; సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలతో వరుసగా స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. తాజాగా యువ హీరో నితిన్‌తో భీష్మ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..

నాతో నటిస్తే ఇక అంతే..
నేను ఎవరి పక్కన నటించినా వారికి పెళ్లి అయిపోతున్నది. కన్నడలో ఓ హీరోతో నటిస్తుండగా ఆయనకు పెళ్లి కుదిరింది. ఇప్పుడు నితిన్‌తో నటిస్తుంటే ఆయనకు పెళ్లి నిశ్చయమైంది. ఇలా పెళ్లిళ్లు కుదరడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక నేను మా డైరెక్టర్ వెంకీ కుడుముల సింగిల్ ఫరెవర్ అని అనుకొంటున్నాం అని రష్మిక అన్నారు.

నాకు మంచి ఫ్రెండ్
ఇక తాజాగా భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ.. నితిన్‌ను నా కో-స్టార్ అనలేను. నాకు చాలా దగ్గరయ్యారు. అందుకే అతడిని నేను ఫ్రెండ్‌గా భావిస్తాను. నాకున్న మంచి స్నేహితుల్లో నితిన్ ఒక్కరు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్‌కు నా శుభాకాంక్షలు అంటూ రష్మిక ఎక్సైట్ అయ్యారు.

నాలాంటి బిడ్డను కనాలి..
అంతేకాకుండా అదే జోష్‌లో మాట్లాడుతూ.. నితిన్ త్వరలోనే నీవు నాలాంటి అమ్మాయికి జన్మనివ్వాలి. నేను చాలా మంచిదాన్ని. నీకు కూడా అలాంటి బిడ్డ పుట్టాలని కోరుకొంటున్నాను. అంటే కనీసం మూడేళ్ల తర్వాతైనా నీకు మంచి అమ్మాయి పుట్టాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని రష్మిక అనడంతో నితిన్ ఒకింత సిగ్గుతో ముడుచుకుపోయారు.

ఆర్గానిక్ వ్యవసాయంపై భీష్మ
ఈ రోజుల్లో నిజమైన ఫ్రెండ్స్ ఉండటం చాలా కష్టం. కానీ ఈ సినిమాకి పనిచేసేటప్పుడు నేను చాలా మంచి వ్యక్తులను కలిశాను. వారిలో వెంకీ కుడుముల ఒకరు. ఈరోజు టాలీవుడ్ లో నేనిక్కడ ఉన్నానంటే ఒక ప్రధాన కారణం ఆయనే. 'భీష్మ' స్క్రిప్టును ఆర్గానిక్ వ్యవసాయం నేపథ్యంతో ఆయన రాసుకున్నారు. ఈ సినిమాని ఆయన తీస్తున్న విధానం చూసి నేను సరెండర్ అయిపోయా. పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి అని రష్మిక అన్నారు.