Don't Miss!
- News
వైఎస్ వివేకా హత్య కేసులో మున్ముందు అనూహ్య పరిణామాలు?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పడుకోవడం ఒకే.. ఫీలవ్వడం ఫర్వాలేదు.. ఇప్పుడు అన్నీ అందులో భాగమే.. రష్మిక
కన్నడభామ రష్మిక మందన్న లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తూనే తన అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో గృహ నిర్బంధంలో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు, అభిమానులకు ధైర్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధిపై పోరాటాన్ని గెలవడానికి బలం, మానసిక ధైర్యాన్ని కూడగట్టుకోవాలని ఆమె సూచిస్తున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా రష్మిక స్పందిస్తూ..

లాక్‌డౌన్‌తో పరిస్థితులు దారుణంగా
లాక్‌డౌన్ పరిస్థితి రోజు రోజుకు నాకు చాలా కష్టంగా మారుతున్నది. అలాగని నేను ఆదేశాలను జవదాటడం లేదు. ఈ సందర్భంగా మీతో చిన్న విషయాన్ని పంచుకోవాలని చూస్తున్నాను. కరోనా లౌక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితం కావడం కొంత టెన్షన్‌కు గురిచేస్తున్నది. ఇలాంటి సమయాల్లోనే మనమేంటో రుజువు చేసుకోవాలి అని రష్మిక పేర్కొన్నారు.

ఫ్యాన్స్ ప్రేమతో నాకు సందేశాలు
క్వారంటైన్‌లో ఉన్న నా ఫ్యాన్స్‌లో చాలా మంది నాకు ఏదోరకమైన సందేశాలను పంపుతున్నారు. వారి ప్రేమను చాటుతూ మానసికమైన ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అభిమానులకు నేను ఒకటే చెబుతున్నాను. మీరంతా ఈ సమాజానికి కావాల్సిన వారు. మీ కుటుంబాలకు అండగా నిలువాల్సిన వారు మీరే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను అని రష్మిక అన్నారు.

కుటుంబాలకు దూరంగా
మన జీవితాలను కరోనా చాలా దారుణంగా మార్చి వేసింది. కుటుంబాలకు చాలా మందిని దూరం చేసింది. లాక్‌డౌన్ వల్ల దగ్గరగా ఉన్న స్నేహితులను కూడా కలుసుకోలేకపోతున్నాం. ఇది మనల్ని భావోద్వేగానికి గురిచేస్తున్నది. ఇలాంటి సమయంలోనే మనమంత సానుకూల దృక్పథంతో ఉండాలి. త్వరగా ప్రతీ ఒక్కరు ఈ పరిస్తితి నుంచి బయటపడాలి అని రష్మిక అన్నారు.

మానసిక సంఘర్షణకు గురికావొద్దు
లాక్‌డౌన్ పీరియడ్‌లో మానసిక సంఘర్షణకు గురికావొద్దు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి. ఇంట్లో తినడం, ఎప్పుడూ పడుకోవడం సరే. ఎలాంటి ఫీలింగ్ లోను కావడం ఒకే. నీకు నీవు బుజ్జగించకొనే ప్రయత్నం చేయాలి. ఇలాంటి సమయంలో త్యాగం చేయడం కూడా నేర్చుకోవాలి. కష్టమైనప్పటికీ కొన్నింటిని ఫాలో కావడం నేర్చుకోవాలి. ఇతరులను నిందించడం మానుకోవాలి అంటూ కొన్ని జీవిత సూత్రాలు తెలిపారు
Recommended Video

రష్మిక కెరీర్ ఇలా..
భీష్మ
లాంటి
మంచి
విజయాన్ని
అందుకొన్న
రష్మికకు
చేతినిండా
ప్రాజెక్టులు
ఉన్నాయి.
తమిళంలో
కార్తీతో
సుల్తాన్,
తెలుగులో
అల్లు
అర్జున్‌తో
పుష్ప
చిత్రాల్లో
నటిస్తున్నారు.
అలాగే
కన్నడలో
పొగరు
చిత్రంలో
నటించింది.
ఈ
సినిమా
టీజర్
మహిళల
మనోభావాలను
దెబ్బ
తీసేలా
ఉందనే
వివాదం
కొనసాగుతున్న
విషయం
తెలిసిందే.